Coco
-
ఎన్నో ప్రయోజనాలు.. ఎంచక్కా చాక్లెట్లు లాగించేయొచ్చు! కానీ..
కిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. అండ్ మిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. అంటూ టీవీలో వచ్చే ఓ యాడ్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ యాడ్ చూస్తుంటే.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు నోరూరుతుందంటే అతిశయోక్తి కాదేమో! విదేశాల నుంచి మనకు తెలిసిన బంధువులు వస్తే.. మొదటి ప్రశ్న ఏలా ఉన్నారు? వెంటనే మరో ప్రశ్న.. చాక్లెట్లు తీసుకొచ్చారా? ఇదంతా ఎందుకంటారా? ఈ రోజు చాక్లెట్ దినోత్సవం. ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు నోరు తీపి చేస్తుంటాం. అపురూపంగా చాక్లెట్‌ను తీసుకుని తింటూ పంచే వారికి విషెస్ చెబుతాం. చాక్లెట్లను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లలు తెగతింటారు. ఒక్క రూపాయి మొదలుకొని వేల రూపాయల్లో ఉండే చాక్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్ డే సందర్భంగా ఈ రోజు తియ్యని వేడుక చేసుకుందామా? – పెదగంట్యాడ(గాజువాక) చాకొలెట్.. ఇది ఒక తీపి పదార్థం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. గొంతులో కమ్మగా దిగిపోతుంది. మంచి అనుభూతిని పంచుతుంది. తీపి అనేది శుభ సూచకం. పుట్టినరోజు వేడుక వచ్చిందంటే.. చాక్లెట్లు ఉండాల్సిందే.. వాటిని అందరికీ పంచాల్సిందే.! ప్రేమికుల రోజు నాడు కూడా పూలతో పాటు చాక్లెట్ ఇవ్వడం కూడా ఆనవాయితీ. ఇవే కాదు.. ఏ వేడుక అయిన చాక్లెట్లతోనే నిండిపోతోంది.. చిన్నారులకైతే చాక్లెట్లంటే చెప్పలేనంత ఇష్టం.. ఇళ్లలో ఉన్న చాక్లెట్ల డబ్బాలను ఖాళీ చేసే వరకూ నిద్రపోరు. ఇలా నగరం నోరు తీపి చేసుకుంటోంది. చాక్లెట్ రుచికి దాసోహమంటోంది. పుట్టిన రోజైనా.. ప్రేమికుల దినమైనా.. పరీక్షల్లో పాసైనా, ఆనందించే ఊసేదైనా.. ‘చాక్లెట్ పార్టీ’ తప్పనిసరి అంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న చాకొలెట్ క్రేజ్‌లో సిటీ గణనీయమైన వాటా పంచుకుంటోంది. రూపాలెన్నో... రుచి ఒకటే.. ఒకప్పుడు అంటే రాపర్లలో చుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు, ఆ తర్వాత డైరీ మిల్క్ లాంటివి... అలా కొన్నే ఉండేవి. ఇప్పుడు విభిన్న రకాల్లో అందుబాటులో ఉన్నాయి. విభిన్న రకాల ఫ్లేవర్లు, ముడి దినుసులలో సులువుగా కలిసిపోయే సుగుణం చాక్లెట్‌ను మరింతగా ప్రేమించేలా చేస్తోంది. ఐస్‌క్రీమ్స్, మిల్క్‌షేక్స్.. ఇలా ప్రతి దానిలో చాక్లెట్స్ ఒదిగిపోతున్నాయి. పండ్ల దగ్గర్నుంచి లిక్కర్ దాకా ప్రతిదానికీ జత కడుతున్నాయి. సిరప్‌లతో సహా విభిన్న రూపాల్లో చాక్లెట్లు వినియోగించడం సిటీలో బాగా పెరిగింది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాకో క్రేజ్‌లో మునిగి తేలుతున్నారు. చాక్లెట్ ఐస్‌క్రీమ్, చాక్లెట్ బార్, చాక్లెట్ బాల్స్, చాక్లెట్ మౌంటెన్, వైట్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్, చాక్లెట్ కప్ కేక్, హాట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ .. ఇలా వందల రకాలు సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే మన చెంతకు చేరుతున్నాయి. బిస్కెట్ల కంపెనీలు కూడా ఇప్పుడు చాక్లెట్ల రుచులతోనే తయారు చేస్తున్నాయి. చాకెట్ల అందించే ప్రత్యేక షాపులు వెలిశాయి. కేక్ షాపుల్లో చాక్లెట్లే క్రేజ్. ఈట్.. చాక్లెట్ ఏదైనా ఫుడ్ కాస్త హెవీగా తీసుకున్న తర్వాత చాకొలెట్‌ను ఎంజాయ్ చేయడం బాగా పెరిగింది. డిన్నర్, స్నాక్స్ పూర్తి చేసిన తర్వాత కూడా సిటీజనులు లెట్స్ చాక్లెట్ అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తర్వాత కూడా వీటి వినియోగం బాగా ఉంటోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ట్రెండ్ మరింతగా కనిపిస్తోంది. చాక్లెట్ మోమో, చాక్లెట్ పిజ్జా, శాండ్విచ్, చాక్లెట్ గ్రిల్డ్ శాండ్విచ్, చాక్లెట్ టోస్ట్ వంటివి ఆన్లైన్ ద్వారా బాగా ఆర్డర్లు అందుకుంటున్న వాటిలో ఉన్నాయి. చాక్లెట్ కుకీ, చాక్లెట్ పేస్ట్రీస్ తదితర చాకెట్లు ఉత్పత్తులను బాగా ఆర్డర్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ రోజే ఎందుకు? ఏటా జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకొంటున్నారు. జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారైందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నిర్వహించారు. అప్పటినుంచి కొనసాగిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు ►డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ►కోకో చెట్టు నుంచి సేకరించిన విత్తనాలతో దీనిని తయారు చేస్తారు. ►రుచితో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంది. ►డార్క్ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరస్తుంది. ►రక్తపోటు సమస్య నుంచి రక్షిస్తుంది. ►రక్తం గడ్డ సమస్య నుంచి కూడా కాపాడుతుంది. ►మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సాఫీగా సాగేలా చూస్తుంది. ►యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ►డార్క్ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరస్, మెగ్నీషియం, కాపర్ కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్ల వల్ల కలిగే నష్టాలు ►మితంగా తింటే మేలు చేస్తాయని.. అమితింగా తింటే కీడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ►అధికంగా చాక్లెట్లు తినే అలవాటు ఉన్న వారికి వేగంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ►దీని వల్ల వారు మిగతా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారని వైద్యులు అంటున్నారు. ►అంతేకాకుండా చాక్లెట్లు ఎక్కువగా తినే పిల్లల్లో కూడా పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. ►పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది ►రాత్రి వేళల్లో చిన్నారులు చాక్లెట్లు తిని పడుకుంటే పిప్పి పళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ►ఒకవేళా తిన్నా.. వెంటనే బ్రష్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ►ఎక్కువగా చాక్లెట్లు తినడం మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తినాలి. –డాక్టర్ వి.సుజిత్‌కుమార్, దంత వైద్యుడు ఊబకాయం వస్తుంది ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇతర ఆహారంపై ఆసక్తి ఉండదు. శరీరం మాత్రం భారీగా పెరిగిపోతుంది తప్ప దానికి అవసరమైన ప్రోటీన్స్ అందవు. దీని వల్లే ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. –డాక్టర్ రమేష్‌బాబు, వైద్యాధికారి, పెదగంట్యాడ పీహెచ్సీ చాక్లెట్ అంటే చాలా ఇష్టం చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువగా తినేదానిని. ఇప్పుడు ఈ అలావాటు నాతో పాటు నా భర్తకు, పిల్లలకు కూడా వచ్చేసింది. రోజులో ఒక్కసారైనా.. ఒక్క చాక్లెట్ అయినా తినకుండా ఉండేలేం. వేడుకల్లో కూడా చాక్లెట్లే మాకు ప్రత్యేకం. – కె.శ్రీలక్ష్మి, పెదగంట్యాడ చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
కోకిలగా జాన్వీ
2018లో నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). తమిళ తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. నయనతార చేసిన పాత్రను జాన్వీ కపూర్ చేయనున్నారని సమాచారం. ఈ హిందీ రీమేక్‌ను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో అనుకోకుండా డ్రగ్స్ రాకెట్లో చిక్కుకొని డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసే అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
డబుల్ ధమాకా
అభిమానులు తమ ఫేవరెట్ యాక్టర్స్‌ని స్క్రీన్‌పై తరచూ చూడాలనుకుంటారు. కానీ ఒక్కో సినిమాకు నాలుగైదు నెలలు గ్యాప్ వస్తుంది. కొన్ని సార్లు సంవత్సరం కూడా పట్టొచ్చు. ఒకే నెలలో రెండు సార్లు తమ అభిమాన యాక్టర్‌ను థియేటర్స్‌లో చూసే చాన్స్ వస్తే? అది ఖచ్చితంగా డబుల్ ధమాకానే. నయనతార తన అభిమానులకు ఒకే నెలలో కనిపించి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆగస్ట్ నెలలో రెండుసార్లు స్క్రీన్ పై కనిపించి అభిమానులను ఖుషీ చేయనున్నారామె. నయనతార ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు నెల్సన్ రూపొందించిన చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆగస్ట్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అలాగే రాశీ ఖన్నా, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’ని ఆగస్ట్ 24న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది. సో.. ఒకే నెలలో, అది కూడా పదిహేను రోజుల గ్యాప్‌లో రెండు సార్లు నయనతార కనిపించనున్నారన్నమాట. నయన ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. -
నయన్ చిత్రంలో అనిరుధ్
తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సంబంధించిన న్యూస్ అంటేనే సినీ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా మారిపోయింది. దశాబ్దం దాటినా అగ్రనటిగా రాణిస్తున్న అరుదైన నటి ఈ కేరళా బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో బిజీబిజీగా నటించేస్తున్న నయనతారను చూసి సహ నటీమణులు ఈర్ష్య పడుతున్నారు. మాయ, అరమ్ వంటి చిత్రాలు ఈ నటి స్థాయిని మరింత పెంచేశాయి. తాజాగా నయనతార నటిస్తున్న అలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కొలమావు కోకిల (కొకో). నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో పలు ప్రత్యేకతలు చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. నానుమ్ రౌడీదాన్ చిత్రం ఆమెకు సినీకేరీర్ పరంగానూ, వ్యక్తిగత జీవితం పరంగానూ పెద్ద ప్లస్ అయ్యింది. అందులో నటనకు ప్రశంసలు, అవార్డులు అందుకున్న నయనతార జీవితంలోకి ఆ చిత్రం దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమికుడిగా వచ్చారు. ఇక కొలమావు కోకిల చిత్రానికి వస్తే ఇందులో నయనతార మూగ యువతి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇందులో నటి శరణ్య పొన్వన్నన్, జాక్విలిన్, అరంతంగి నిషా, యోగిబాబు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇక మంచి రైజింగ్‌లో ఉన్న యువ సంగీతదర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత బాణీలను కడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్విట్ చేశారు. కొలమావు కోకిల చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని తెలిపారు. నవ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈయన అనిరుధ్‌కు బాల్యమిత్రుడట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇందులో ఈ సంచలన సంగీతదర్శకుడు ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. వడకర్రి లాంటి కొన్ని చిత్రాల్లో పాటల్లో తళుక్కున మెరిసి వెళ్లిపోయిన అనిరుధ్ నయనతార చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు చాలా మంది నటించమని కోరినా నిరాకరించిన అనిరుధ్‌ను దర్శకుడు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పించినట్లు టాక్. సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కూడా ఇలా అప్పుడప్పుడూ పాటల్లో మెరిసి ఈ తరువాత ఫుల్‌టైమ్ హీరోగా మారిపోయారు. మరి అనిరుధ్ కెరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. -
మూగ పాత్రలో లేడీ సూపర్ స్టార్
తమిళసినిమా: నయనతార ఇప్పుడు అభినయంతో కూడిన పాత్రలకే ఆమోదముద్ర వేస్తున్నారు. అగ్రతార ఇమేజ్ను కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆ తరహావే అని చెప్పవచ్చు. త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం. నయనతార నటిస్తున్న చిత్రాల్లో కోకో ( కోలమావు కోకిల) ఒకటి. నయనతార నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికిన చిత్రాల్లో నానూ రౌడీదాన్ ఒకటి. అందులో నయనతార చెవిటి యువతి పాత్రలో అద్భుతంగా అభినయించి ప్రశంసలు పొందారు. ఈ పాత్రకుగానూ సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా నటిస్తున్న కోకో చిత్రంలో మూగ అమ్మాయిగా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె పాత్ర స్వరూపం, హావభావాలు, ధరించే దుస్తుల వరకూ చాలా వైవిధ్యంగా ఉంటాయట. అరమ్ చిత్రంలో పూర్తిగా విభిన్నంగా కనిపించిన నయనతార కోకో చిత్రంలో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
అట్టహాసంగా ఎంపిక పోటీలు చంద్రమాంపల్లి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలకు బాలబాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎస్ఎం జిలాని స్మారక మెమోరియల్ ఖోఖో చాంపియన్ షిప్ పేరిట ఆజాద్ నేషనల్ ఆర్మీ, జెడ్పీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పది బాలుర జట్లు, సుమారు 60 మంది బాలికలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే బాలికల జట్టుకు 17 మందిని ఎంపిక చేశారు. హాజరైన వంద మందిలో 17 మందిని బాలుర జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అ«««దl్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావడానికి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఎంపికైన జట్లను అభినందించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నలమాటి జానకి రామయ్య, పట్టాభిరామ్, మాజీ ఎంపీపీలు గోపు అచ్యుతరామయ్య, ఇంధన జయకృష్ణ, శృంగార వల్లభ స్వామి ఆలయ చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పాగా సురేష్, యండ్రు సత్తిబాబు, బుజ్జి, తుమ్మల రాజా, పచ్చిపాల ప్రసాదరావు, వేమల పండు, తుమ్మల వీరస్వామి నాయుడు, ఎంఈఓ బాబురావు, హెచ్ఎం కె.గాయత్రి, పీఈటీలు మట్టా సుబ్బారావు, మట్టా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, పీఎస్ఎన్ మూర్తి, కేఎస్ఎన్ మూర్తి, టీఎస్ఎన్ మూర్తి, ఎన్.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాలికల జట్టు : ఓ.నాగదేవి, డి.అమృత, డి.లక్ష్మీసౌందర్య, సీహెచ్.దివ్య, పి.చంద్రఅనూష, ఎన్.అంజలి శ్రీదేవి, ఎన్.మౌనిక, కె.శ్యామల, పి.సదా, కె.రాజేశ్వరి, ఎల్.వీరలక్ష్మి, ఎస్.లీలా సత్యవేణి, వి.అక్షయ, ఎ.సుగుణ, ఎ.వెంకటదుర్గ, ఎ.రమ్యభారతి, పి.లక్ష్మి. బాలుర జట్టు : వి.వెంకటేష్, జి.నాగేంద్ర, ఎం.సాయి, వెంకట్, రాజీవ్, వై.మహేష్, జి.సూర్య మణికంఠ, ఎస్వీ ప్రసాద్, జి.సత్యేంద్ర, మణికంఠ, పి.చందు, ఎం.వెంకటరమణ, వీర ఆదిశివ, వై.అప్పాజీ. -
ఖోఖో జట్ల ఎంపికలు పూర్తి
నెల్లూరు(బృందావనం) : రాష్ట్రస్థాయిలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ బాల,బాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి వరకు జరిగిన పోటీలు, ఎంపికల్లో జిల్లా జట్టులో పాల్గొనే క్రీడాకారుల వివరాలను జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గురుప్రసాద్ విలేకరులకు తెలిపారు. బాలురజట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా ఎన్.రాజ, షేక్ షబీకా, రేవతి, కె.సుమతి బాలికల జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా పి.అజయ్‌కుమార్, షేక్ హుస్నారా, పి.గాయత్రి, కె.కామాక్షి, కమిటీ చైర్మన్‌గా ఎం.గిరిప్రసాద్ వ్యవహరించారు. అలాగే పోటీలు, ఎంపికలను డీకేడబ్ల్యూ ప్రభుత్వడిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై.రవీంద్రమ్మ, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జిలానీబాష, సహకార్యదర్శి గాదంశ్రీనివాసులు తదితరులు పర్యవేక్షించారు. బాలురజట్టులో : కె.రామకృష్ణ, పి.ప్రసన్నకుమార్, బి.వెంకటేశ్ (కేఎన్ఆర్ఎం స్కూల్, నెల్లూరు), కె.పురంధర్,(జీవీకే డిగ్రీకళాశాల, ఇందుకూరుపేట), టి.మనోహర్ (బ్రహ్మయ్య జూనియర్ కళాశాల), కె.వెంకటేష్ (లెండీ జూనియర్‌కాలేజీ), బి.నాగరాజు (శ్రీకృష్ణచైతన్య జూనియర్ కళాశాల), ఓ.షణ్ముఖేష్, వి.సాయికుమార్, సీహెచ్ నాని, ఐ.ప్రసాద్, ఎన్.గణేష్ (రావూస్ జూనియర్ కాలేజీ), కె.మహేంద్ర (జెడ్పీపీపీ ఉన్నత పాఠశాల, వావిళ్ల), ఎ.వేణు (జగన్స్ డిగ్రీ కళాశాల), డి.హితేష్ (నారాయణ జూనియర్ కళాశాల), కె.వంశీకృష్ణ, పి.సంపత్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, విడవలూరు), పి.నాగరాజు (జెడ్పీహెచ్ఎస్, కొమరిక) ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు. బాలికల జట్టులో.. పి.సంధ్యారాణి, సీహెచ్ కల్యాణి (డీకేడబ్ల్యూ ప్రభుత్వ జూనియర్‌కళాశాల), సీహెచ్ ప్రియాంక, బి.పద్మ ,కె.గీత (కేఎన్ఆర్ఎం ఉన్నత పాఠశాల), పి.అఖిల, బి.శిరీష, కె.అశ్విని(కేజీబీవీ, కావలి), వై.ప్రసన్న, కె.యశోద(జీఏహెచ్‌ఎస్, గొలగమూడి), ఎన్.లీలావతి, పి.మహేశ్వరి (కేజీబీవీ,వెంకటగిరి), కె.శైలజ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఎస్, కండలేరు), టి.దివ్య (కొత్తకోడూరు), డి.దేవదర్శిని, సీహెచ్ గాయత్రి (చంద్రశేఖరపురం జూనియర్ కళాశాల, కొడవలూరు), జె.మనీషాసుష్మ (ఏపీఎస్డబ్ల్యూర్, కొత్తకోడూరు), ఎల్.çసుభాషిణి(ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కండలేరు), పి.విద్య (సర్వేపల్లి) ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు. -
పెంపుడు కుక్కకు ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు
బీజింగ్: ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందనగానే అబ్బ.. అని గబుక్కున మనసులో ఓ ఆశ పుడుతుంది. అలాంటిది ఏకంగా ఎనిమిది ఐఫోన్లు గిప్ట్గా వస్తున్నాయంటే ఇంకెలా ఉంటుంది. ఎగిరి గంతేయరు.. సాధారణంగా మనుషులైతే ఇలాగే చేస్తారు.. కానీ ఆ ఫోన్లు గిఫ్ట్‌గా వచ్చింది ఓ పెంపుడు కుక్కకు. అది కూడా కొత్త వెర్షన్ ఐఫోన్లు. ఈ మధ్య ఆపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 7ఎస్ ఫోన్లు. వాటిని దర్జాగా తన ముందు పెట్టుకొని హుందాగా సోఫాలో కూర్చుని తన యజమానికి తానంటే ఎంతిష్టమో ఓ స్టిల్ తో చెప్పేసింది ఆ కుక్క. ఇది చేసింది చైనాలోని అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్లిన్ అనే వ్యక్తి కుమారుడు. వాంగ్ జియాన్ లిన్(61) అనే వ్యక్తి చైనాలో అతిపెద్ద కుభేరుడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతడికి 30 బిలియన్ డాలర్ల ఆస్తితో చైనాలో మిక్కిలి ధనవంతుడిగా ఉన్నాడు. అతడికి వాంగ్ సికాంగ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి ఇతనొక్కడే కొడుకు. అతడిని ఎంత గారభంగా పెంచాడో ఈ కుర్రాడికి ఉన్న 'కోకో' అనే పెంపుడు కుక్క ఉంది. దానికోసం అతడు చేసే హంగామా అంతా ఇంత కాదు. దాని పుట్టిన రోజు వచ్చినా మరేదైనా సందర్భం వచ్చినా కనీసం మనుషులకు కూడా చేయనంత గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహిస్తాడు. కోకోకు ప్రత్యేక డ్రెస్, ప్రత్యేక షూ, కళ్లజోడు, టోపీ, హ్యాండ్ బ్యాగ్, గోల్డ్ చైన్, ప్రత్యేక ఫుడ్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఓ చాంతాడంత లిస్టే ఉంది. ఇంత రాజభోగాలు అనుభవిస్తున్న ఆ కుక్కకు ఈ మధ్యే ఆపిల్ విడుదల చేసిన ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు గిఫ్ట్ గా ఇచ్చి ఆ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టగా అదిప్పుడు పెద్ద వైరల్ గా మారి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ కుక్కకు రెండు ఆపిల్ వాచ్‌లు కూడా ఉన్నాయి. దీని బాధ్యతలు చూసుకునేందుకు సిబ్బంది కూడా ఉన్నారట. ఓ అంఛనా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలతో రాజభోగాలు అనుభవిస్తున్న పెంపుడు కుక్క ఇదేనని తెలుస్తోంది. -
వారెవా! ఏమి గోవా!!
ఈ మాట ప్లేస్ గురించి మాత్రమే కాదు... ఫుడ్డు గురించి కూడా! గోవాలో తిరిగొస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. వాలో తిని వస్తే బాడీ రీచార్జ్ అవుతుంది. సీఫుడ్డు, కోకోనట్టు, రైస్, కూరగాయలు.. కొంచె స్పైస్... అన్నిచోట్లా ఉండేవే కానీ... గోవా స్టెయిల్లో చేస్తే ఆ టేస్టే వేరు. ట్రై చెయ్యండి. గోవా సమోసా కావల్సినవి: మైదా - కప్పు; వెన్న - 2 టీ స్పూన్లు ఉల్లిపాయల తరుగు - అర కప్పు బంగాళదుంపల ముక్కలు (ఉడికించి, సన్నగా తరగాలి) - కప్పు పచ్చిబఠాణీ - అర కప్పు; పచ్చిమిర్చి - 1 అల్లం ముద్ద- అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు - పావు కప్పుకారం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంతనూనె - వేయించడానికి తగినంత తయారీ: ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి, నీళ్లు పోసి దోసె పిండిలా ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయల తరుగు వేసి, వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంపలు వేసి కలపాలి. అన్నీ బాగా వేగాయనిపించాక దించాలి.మైదాలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, పూరీ పరిమాణంలో వత్తాలి. కత్తితో సగానికి కట్ చేసి, దీంట్లో సిద్దం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి, త్రికోణాకారంలో మడవాలి. ఇలా మడిచేటప్పుడు లోపలి మిశ్రమం బయటకు రాకుండా కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమంలో వేళ్లను అద్దుకుంటూ చివర్లను అదమాలి. ఇలాగే అన్నీ తయారుచేసుకొని, కాగుతున్న నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. గోవా చేపల కూర కావల్సినవి: చేప ముక్కలు (పాంఫ్రెట్) - 600 గ్రా.లు కొబ్బరి తురుము - ముప్పావు కప్పు కొబ్బరి పాలు - ముప్పావు కప్పు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; అల్లం పేస్ట్ - 4 టీ స్పూన్లు వెల్లులి పేస్ట్ - టీ స్పూన్; పచ్చిమిర్చి - 4 పల్లీ నూనె - 5 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - 3 టేబుల్స్పూన్ల ఉల్లిపాయల తరుగు - 3 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి - 15; ఉప్పు - రుచికి తగినంత చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు టొమాటో తరుగు - పావు కప్పు పసుపు - అర టీ స్పూన్ తయారీ: తగినంత ఉప్పు, నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేప ముక్కలపై పోసి, గంట సేపు ఉంచాలి. నిమ్మరసంలో నానిన చేప ముక్కలు రుచిగా ఉంటాయి. మిక్సర్జార్లో కొబ్బరి తరుగు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్చేయాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొబ్బరి పాలు పోసి బ్లెండ్ చేయాలి. కడాయి వేడి చేసి, నూనె వేయాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి .దీంట్లో టొమాటో ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేయించి, కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. పచ్చిమిర్చి తరుగు, చేప ముక్కలను 7 నిమిషాలు సన్నని మంటమీద ఉడికించాలి. పైన మూత పెట్టకుండానే ఈ కూరను వండాలి. మంట తీసి కొత్తిమీర చల్లి దించాలి. రొయ్యల కూర కావలసినవి: రొయ్యలు - పావుకేజీ నూనె - 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి - అర టీ స్పూన్; అల్లం - టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (తరగాలి); పసుపు - పావు టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత పేస్ట్ కోసం.. జీలకర్ర - టీ స్పూన్ కొబ్బరి తరుగు పాలు - అర కప్పు మిరియాలు - 15; కారం - టీ స్పూన్ వెనిగర్ - అర టీ స్పూన్; అల్లం - అర టీ స్పూన్ వెల్లుల్లి - అర టీ స్పూన్ తయారీ ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి. రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి. దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. కోకనట్ కేక్ కావల్సినవి: బొంబాయి రవ్వ - కప్పు, ఎండు కొబ్బరి తురుము - కప్పు జీడిపప్పు పొడి - అర కప్పు, బేకింగ్ పౌడర్ - టీ స్పూన కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - టీ స్పూన్, వెన్న - 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ - పావు కప్పు, పాలు - అర కప్పు యాలకులు - 4, బాదంపప్పు - అలంకరణకు తగినన్నిపంచదార పొడి - తగినంత తయారీ: ఒక గిన్నెలో వేయించిన రవ్వ, కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, కార్న్‌ఫ్లోర్, పంచదార పొడి, జీడిపప్పు పొడి వేసి కలపాలి. దీంట్లో కరిగించిన వెన్న, కండెన్స్డ్ మిల్క్, పాలు వేసి మళ్లీ బాగా కలపాలి. మరీ గట్టిగా ఉంటే మరికొన్ని పాలు కలపాలి. దీనిపైన మూత పెట్టి, 7 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి, అరగంట సేపు బయట ఉంచాలి. దీంట్లో యాలకుల పొడి, వెనిల్లా ఎసెన్స్ కలపాలి. ఈ కేక్‌ను ప్రెషర్ కుకర్‌లో తయారుచేసుకోవచ్చు. అయితే, గ్యాస్కట్, వెయిట్ అవసరం లేదు. పాత ఇడ్లీపాత్రలా ఉండే మందపాటి కుకర్ అయితే బాగుంటుంది.కేక్ బేక్ చేసే పాత్ర అడుగునే 2 కప్పుల టేబుల్ సాల్ట్ వేయాలి. 2 కప్పుల ఇసుక వేయాలి.దీంట్లో కేక్పాత్ర పెట్టడానికి అనువుగా ఒక స్టాండ్‌ను ఉంచాలి. ఇప్పుడు ఈ పాత్రను వేడి చేయాలి.కుకర్‌లో పెట్టే పాత్ర అడుగున నూనె లేదా వెన్న రాసి మిశ్రమం అంతా అందులో వేసి, స్పూన్‌తో ప్లాట్‌గా సర్ది, పైన బాదం, జీడిపప్పు తరుగులు వేయాలి. ఈ పాత్రను కుకర్‌లో పెట్టి, పైన మూత పెట్టాలి. (గ్యాస్కట్, విజిల్ అవసరం లేని గట్టి మూత ఉండాలి) సన్నని మంట మీద 45-50 నిమిషాల సేపు బేక్ చేయాలి.మిశ్రమం బాగా ఉడికి, ముదురు గోధుమ రంగులోకి వస్తుంది. దీనిని తీసి నిల్వ చేసుకోవచ్చు. 4-5 రోజుల వరకు ఉపయోగించవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావల్సినవి: అరటికాయ ముక్కలు - కప్పు గుమ్మడికాయ ముక్కలు - కప్పు మునక్కాడ ముక్కలు - 1 కప్పు (మూడు అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి) ముల్లంగి - 1 (ముక్కలు చేయాలి) పచ్చి బఠాణీ - అర కప్పుకందిపప్పు - పావు కప్పుపచ్చి కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు కారం - 3 టీ స్పూన్లు పసుపు - అర టీ స్పూన్ టెఫ్లేమ్ (ఇవి గోవాలో దొరికే సుగంధద్రవ్యాలలో ఒకటి. వంటలకు మంచి సువాసన రావడానికి దీనిని వాడతారు. మనం మిరియాలను ఉపయోగించవచ్చు) - 10 చింతపండు గుజ్జు - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత తయారీ:చింతపండు గుజ్జు, కారం, కొబ్బరి తరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీంట్లో టెఫ్లేమ్స్ లేదా మిరియాలు, 3 కప్పుల నీళ్లు కలిపి ఉడికించాలి. దీంట్లో మునక్కాడలు, ముల్లంగి ముక్కలు, పప్పు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గుమ్మడి, అరటికాయ ముక్కలు, పచ్చిబఠాణీలు వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొబ్బరి తరుగు మిశ్రమం, ఉప్పు, కప్పు నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి. ఈ కూర చపాతీ, పూరీ, అన్నంలోకి వడ్డించాలి.