ఖోఖో జట్ల ఎంపికలు పూర్తి
ఖోఖో జట్ల ఎంపికలు పూర్తి
Published Tue, Oct 18 2016 1:16 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
నెల్లూరు(బృందావనం) : రాష్ట్రస్థాయిలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ బాల,బాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి వరకు జరిగిన పోటీలు, ఎంపికల్లో జిల్లా జట్టులో పాల్గొనే క్రీడాకారుల వివరాలను జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గురుప్రసాద్ విలేకరులకు తెలిపారు. బాలురజట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా ఎన్.రాజ, షేక్ షబీకా, రేవతి, కె.సుమతి బాలికల జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా పి.అజయ్‌కుమార్, షేక్ హుస్నారా, పి.గాయత్రి, కె.కామాక్షి, కమిటీ చైర్మన్‌గా ఎం.గిరిప్రసాద్ వ్యవహరించారు. అలాగే పోటీలు, ఎంపికలను డీకేడబ్ల్యూ ప్రభుత్వడిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై.రవీంద్రమ్మ, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జిలానీబాష, సహకార్యదర్శి గాదంశ్రీనివాసులు తదితరులు పర్యవేక్షించారు.
బాలురజట్టులో :
కె.రామకృష్ణ, పి.ప్రసన్నకుమార్, బి.వెంకటేశ్ (కేఎన్‌ఆర్‌ఎం స్కూల్, నెల్లూరు), కె.పురంధర్,(జీవీకే డిగ్రీకళాశాల, ఇందుకూరుపేట), టి.మనోహర్ (బ్రహ్మయ్య జూనియర్ కళాశాల), కె.వెంకటేష్ (లెండీ జూనియర్‌కాలేజీ), బి.నాగరాజు (శ్రీకృష్ణచైతన్య జూనియర్ కళాశాల), ఓ.షణ్ముఖేష్, వి.సాయికుమార్, సీహెచ్ నాని, ఐ.ప్రసాద్, ఎన్.గణేష్ (రావూస్ జూనియర్ కాలేజీ), కె.మహేంద్ర (జెడ్పీపీపీ ఉన్నత పాఠశాల, వావిళ్ల), ఎ.వేణు (జగన్స్ డిగ్రీ కళాశాల), డి.హితేష్ (నారాయణ జూనియర్ కళాశాల), కె.వంశీకృష్ణ, పి.సంపత్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, విడవలూరు), పి.నాగరాజు (జెడ్పీహెచ్‌ఎస్, కొమరిక) ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు.
బాలికల జట్టులో..
పి.సంధ్యారాణి, సీహెచ్ కల్యాణి (డీకేడబ్ల్యూ ప్రభుత్వ జూనియర్‌కళాశాల), సీహెచ్ ప్రియాంక, బి.పద్మ ,కె.గీత (కేఎన్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాల), పి.అఖిల, బి.శిరీష, కె.అశ్విని(కేజీబీవీ, కావలి), వై.ప్రసన్న, కె.యశోద(జీఏహెచ్‌ఎస్, గొలగమూడి), ఎన్.లీలావతి, పి.మహేశ్వరి (కేజీబీవీ,వెంకటగిరి), కె.శైలజ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఎస్, కండలేరు), టి.దివ్య (కొత్తకోడూరు), డి.దేవదర్శిని, సీహెచ్ గాయత్రి (చంద్రశేఖరపురం జూనియర్ కళాశాల, కొడవలూరు), జె.మనీషాసుష్మ (ఏపీఎస్‌డబ్ల్యూర్, కొత్తకోడూరు), ఎల్.çసుభాషిణి(ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కండలేరు), పి.విద్య (సర్వేపల్లి) ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు.
Advertisement