తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సంబంధించిన న్యూస్ అంటేనే సినీ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా మారిపోయింది. దశాబ్దం దాటినా అగ్రనటిగా రాణిస్తున్న అరుదైన నటి ఈ కేరళా బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో బిజీబిజీగా నటించేస్తున్న నయనతారను చూసి సహ నటీమణులు ఈర్ష్య పడుతున్నారు. మాయ, అరమ్ వంటి చిత్రాలు ఈ నటి స్థాయిని మరింత పెంచేశాయి. తాజాగా నయనతార నటిస్తున్న అలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కొలమావు కోకిల (కొకో). నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో పలు ప్రత్యేకతలు చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. నానుమ్ రౌడీదాన్ చిత్రం ఆమెకు సినీకేరీర్ పరంగానూ, వ్యక్తిగత జీవితం పరంగానూ పెద్ద ప్లస్ అయ్యింది. అందులో నటనకు ప్రశంసలు, అవార్డులు అందుకున్న నయనతార జీవితంలోకి ఆ చిత్రం దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమికుడిగా వచ్చారు. ఇక కొలమావు కోకిల చిత్రానికి వస్తే ఇందులో నయనతార మూగ యువతి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.
ఇందులో నటి శరణ్య పొన్‌వన్నన్, జాక్విలిన్, అరంతంగి నిషా, యోగిబాబు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇక మంచి రైజింగ్‌లో ఉన్న యువ సంగీతదర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత బాణీలను కడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్విట్ చేశారు. కొలమావు కోకిల చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని తెలిపారు. నవ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈయన అనిరుధ్‌కు బాల్యమిత్రుడట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇందులో ఈ సంచలన సంగీతదర్శకుడు ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. వడకర్రి లాంటి కొన్ని చిత్రాల్లో పాటల్లో తళుక్కున మెరిసి వెళ్లిపోయిన అనిరుధ్ నయనతార చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు చాలా మంది నటించమని కోరినా నిరాకరించిన అనిరుధ్‌ను దర్శకుడు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పించినట్లు టాక్. సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కూడా ఇలా అప్పుడప్పుడూ పాటల్లో మెరిసి ఈ తరువాత ఫుల్‌టైమ్ హీరోగా మారిపోయారు. మరి అనిరుధ్ కెరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment