కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక | selected for karate competion | Sakshi
Sakshi News home page

కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Published Tue, Feb 14 2017 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

selected for karate competion

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక సోమవారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించినట్లు గుజోరియో డూ రె¯ŒSమయ్‌ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 18, 19 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హరిహర పట్టణంలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కరాటే పోటీలు ఇండో–శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు.  
 
ఎంపిౖకెన క్రీడాకారులు : 30 కేజీల విభాగం కుషీధర్‌ రెడ్డి(అనంతపురం), 38 కేజీల విభాగం మౌర్య(ధర్మవరం), 45 కేజీల విభాగం బాలికలు త్రివేణి(అనంతపురం), బాలురు రామకృష్ణ, శశీ ప్రీతమ్‌(అనంతపురం), 48 కేజీల విభాగం బాలికలు శిల్పా(అనంతపురం), బాలురు మహేష్‌(అనంతపురం), 68 కేజీల విభాగం బాబాషాహుల్, చంద్రశేఖర్‌ రెడ్డి(అనంతపురం) .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement