karate competion
-
పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్‌బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
ముప్పై నాలుగేళ్ల సర్వీసు.. లేడి సింగం
ముప్పై నాలుగేళ్ల్ల సర్వీసులో దాదాపు ఎనిమిది లక్షల మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణనిచ్చారు ఆమె. మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన వర్కషాప్లను నిర్వహిస్తుంటారు. ఢిల్లీలోని కమ్లా మార్కెట్లోని పింక్ చౌకిలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ నేరాలకు అడ్డుకట్టవేయడంలో లేడీ సింగం అని పేరుతెచ్చుకున్నారు, సామాజిక సేవలోనూ తన పాత్ర పోషిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. ‘నా ఉద్యోగమే సామాజిక సేవ. సమాజ సేవ చేయలేని వ్యక్తి పోలీసు ఉద్యోగం కూడా సరిగా చేయలేడు. ముప్పై నాలుగేళ్ల క్రితం నా బ్యాచ్ నుంచి వచ్చిన మొదటి మహిళా పోలీసును. జాయిన్ అయినప్పుడు మా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బోర్డుపై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు’ అని చెబుతారు కిరణ్ సేథీ. కరాటేలో శిక్షణ 1992లో జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ లేడీ సింగం మహిళా కానిస్టేబుళ్లకే కాదు, పురుషులకూ జూడో–కరాటేలో శిక్షణ ఇస్తుంటారు. ‘ఆరుగురు సైనికులకు కూడా శిక్షణ ఇచ్చాను. చదువులో కూడా రాణించాలనుకున్నాను. అందుకు ఐదు పీజీలు పూర్తిచేశాను. గుండాలకు ఎదురెళ్లి ఓ రోజు డ్యూటీకి వెళుతున్నప్పుడు ఒకమ్మాయిని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టడం చూశాను. వెళ్లి అడిగితే బెదిరింపులతో పాటు బ్లేడ్‌తో దాడికి దిగారు. ఆ రోజు నేను సివిల్ డ్రెస్‌లో ఉన్నాను. దీంతో గుండాల బెదిరింపు మరింత ఎక్కువయ్యింది. ఒకరోజు పార్కులో చిన్నారులు ఆడుకుంటున్నారు, మహిళలు నడుస్తున్నారు. అలాంటి ప్లేస్‌లో ఒక వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌ను చూపించి, వేధించడం దృష్టికి వచ్చింది. వెంటనే అక్కడికక్కడే బుద్ధి చెప్పడంతో పాటు కటకటాల వెనక్కి పంపించాను. ఒక్కోసారి రోజుకు మూడు నాలుగు కేసులు వస్తుంటాయి. రాత్రి, పగలు అని ఉండదు. ఆనందం ముఖ్యం అలాగని, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందిలో పెట్టుకోకూడదు. ఆహ్లాదంగానే ఉంచాలి. మహిళా పోలీసులకు కుటుంబం మద్దతు చాలా అవసరం ఉంటుంది. కుటుంబానికి తగినంత సమయం కేటాయించడంతో పాటు, తమ విధులను అర్ధమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. లోలోపల ఆనందంగా ఉన్న వ్యక్తి ఇతరులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎవరికి వారు తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మన శరీరమే దేవాలయం. ఎంత శుద్ధిగా ఉంటే, మన చుట్టూ పరిసరాలను కూడా అంతే బాగా ఉంచగలుగుతాం. పనిలో త్వరగా అలసిపోవడం జరగదు. సాధారణంగా రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఓ గంట సేపు యోగా, మరో గంట చదువు ఉంటుంది. ఆ తర్వాత విధుల్లో భాగంగా ఉంటూనే స్ట్రీట్ చిల్డ్రన్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి చదువు చెప్పించడం, మహిళలకు హస్తకళల పట్ల శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం చేస్తుంటాను. సంస్కరణ బాధ్యత నేరస్తులను పట్టుకున్నప్పుడు వారిని ముందు సంస్కరించాలనుకుంటాను. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాననుకున్నవారికి అవకాశం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేసేలా చూడటం బాధ్యతగా తీసుకుంటాను. ఆ విధంగా శత్రువులు అనుకున్నవారు కాస్తా మిత్రులు అయ్యారు’ అని వివరిస్తారు కిరణ్ సేథీ. -
కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక సోమవారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించినట్లు గుజోరియో డూ రె¯ŒSమయ్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 18, 19 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హరిహర పట్టణంలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కరాటే పోటీలు ఇండో–శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపిౖకెన క్రీడాకారులు : 30 కేజీల విభాగం కుషీధర్ రెడ్డి(అనంతపురం), 38 కేజీల విభాగం మౌర్య(ధర్మవరం), 45 కేజీల విభాగం బాలికలు త్రివేణి(అనంతపురం), బాలురు రామకృష్ణ, శశీ ప్రీతమ్(అనంతపురం), 48 కేజీల విభాగం బాలికలు శిల్పా(అనంతపురం), బాలురు మహేష్(అనంతపురం), 68 కేజీల విభాగం బాబాషాహుల్, చంద్రశేఖర్ రెడ్డి(అనంతపురం) .