జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు | District of players to compete in the national cycle polo | Sakshi
Sakshi News home page

జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు

Published Sun, Nov 20 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఒంగోలు: జాతీయ  సైకిల్ పోలో పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు ఇంటర్‌మీడియెట్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన రాష్ర్టస్థాయి సైకిల్ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు 6-2తేడాతో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. స్థానిక ఆర్‌ఐవో కార్యాలయానికి ఆర్‌ఐవో ఉదయగిరి రమేష్‌బాబు క్రీడాకారులను ప్రశంసించారు. జాతీయ జట్టుకు ఎంపికైన పఠాన్‌షార్జాన్, కట్టా శివకృష్ణ, కుంచాల విజయ్, పోట్లూరి నరేష్‌లు జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అండర్-19 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.హరనాథబాబు, ఏబీఎం కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement