
భారత జట్టులో బౌలర్ బుమ్రా
టి20 జట్టులోకి ఎంపిక
ముంబై: గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన మొహమ్మద్ షమీ స్థానంలో టి20 సిరీస్‌కు గుజరాత్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న బుమ్రా... గత సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఆకట్టుకున్నాడు. జనవరి 26 నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది. యువరాజ్, నెహ్రా, రైనా, పాండ్యా, హర్భజన్‌లతో కలిసి బుమ్రా 22న ఆస్ట్రేలియా వెళతాడు.