స్మార్ట్ సిటీల పథకం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న అలాంటి 20 నగరాలను ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఎంపిక
త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకం: వెంకయ్య
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల పథకం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న అలాంటి 20 నగరాలను ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఎంపిక చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారమిక్కడ ఫిక్కీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీల అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఎంపికైన నగరాల్లో జనవరి నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజలు మెరుగైన వసతులను కోరుకుంటున్నారని, ఆ మేరకు నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకాన్ని తీసుకురావదానికి కసరత్తు చేస్తున్నామన్నారు.