రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
Published Fri, Dec 9 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
అల్లూరు (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అల్లూరు మంతెన సత్యనారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అండర్ 17 వాలీబాల్ బాలికల విబాగంలో ఎ జీవననాగజ్యోతి, పి.భవాని (స్టాండ్‌బై ), వాలీబాల్ అండర్ 14 బాలికల విబాగంలో పి సదా,ఎ లీలా మాధవి , ఎస్‌కె ఫాతిమా (స్టాండ్‌బై )లు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 14 బాలుర విబాగంలో ఎన్‌హర్షవర్దన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు (స్టాండ్‌బైగా ) ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈనెల 8వ తేదీన నరసరావుపేటలో జరిగిన ఖేల్‌ఇండియా జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైయ్యారని తెలిపారు.
Advertisement
Advertisement