అంతర్జాతీయ టార్గెట్‌బాల్ పోటీలకు రేవంత్
Published Sat, Oct 22 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
తుని :
అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన ఎల్.రేవంత్ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ వీవీఎస్ భానుమూర్తి శనివారం తెలిపారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టులో ఉత్తమ ప్రతిభ చూపిన రేవంత్ అంతర్జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడని, డిసెంబరులో భూటా¯ŒSలో జరిగే పోటీల అండర్–19 విభాగంలో భారతజట్టు సభ్యుడుగా ఆడతాడని చెప్పారు. ప్రతిభ చూపిన రేవంత్‌ను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్ , ఉపాధ్యాయులు అభినందించారు.
Advertisement
Advertisement