సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామం కాట్రపాడు
కాట్రపాడు (దాచేపల్లి): మండలంలోని కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డ్వామా ఏపీడీ ఆర్. శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్‌ను సర్పంచ్ అందుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ రెడ్డిచర్ల నాగమ్మను ఆయన అభినందించారు. గ్రామంలో 133 ఇళ్లు ఉన్నాయన్నారు. ఇందులో పాతవి 34 మరుగుదొడ్లు ఉండగా, కొత్తగా 99 నిర్మించారన్నారు. ఏపీడీ వెంట ఏపీవో జి. వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి పి. విజయ్‌కుమార్, వీఆర్వో రాఘవేంద్ర, స్థానికులు రెడ్డిచర్ల బాబు తదితరులున్నారు.