రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక
కారంపూడి: గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి బాలుర, బాలికల ఎంపికలు బుధవారం నిర్వహించారు. గ్రీకో రోమన్ సై్టల్ విభాగంలో గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బి.అబేజ్, ఎం. వాగ్యానాయక్, ఎ.వెంకటేష్, జి.అరవింద్, కె.రవికుమార్, కె.అజయ్, ఎం. విజయ్, డి.బాలకృష్ణ, చండ్రాజుపాలెంకు చెందిన కె.వెంకటరావు ఎంపికయ్యారు. ప్రీ స్టెయిల్ బాలుర విభాగంలో స్థానిక గురుకులానికి చెందిన వై.వీరబ్రహ్మనాయుడు, సీహెచ్ కోటేశ్వరరావు, ఎస్.ఫిలిప్‌రాజు, పి.నాగరాజు, అచ్చెంపేట గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఎం.శివనాగేంద్రప్రసాద్, పి.మరియబాబు, చుండూరు గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఇ. తరుణ, నరేంద్ర, నిజాంపట్నం గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన ఐ. కార్తీక్ ఎంపికయ్యారు. ఫ్రీ స్టెయిల్ బాలికల విభాగంలో వీపీ సౌత్ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన వై.కవిత, వై.శైలజ, ఎం.జీవిత, ఎన్.రూతురాణి, జి.శ్రావణి, వినుకొండ గురుకుల పాఠశాలకు చెందిన జి.మీనాకుమారి, ఎస్. రోషిత, పి.పార్వతి ఎంపికయ్యారని అమెచ్యూర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్ధానిక గురుకుల పీడీ గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 28, 29 తేదీలలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గురుకుల ప్రిన్సిపల్ సుధాకర్ పోటీలను ప్రారంభించారు.