హైదరాబాద్‌ మూలాలున్న రియాకు అవార్డు  | Riya Uppalapati Got Selected For Atlanta Innovators Awards | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మూలాలున్న రియాకు అవార్డు 

Published Sun, Dec 15 2019 4:25 AM | Last Updated on Sun, Dec 15 2019 5:20 AM

Riya Uppalapati Got Selected For Atlanta Innovators Awards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని మూలాలున్న రియా ఉప్పలపాటి అనే 17 ఏళ్ల యువతి ‘అట్లాంటా ఇన్నోవేటర్స్‌’టాలెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. పాతికేళ్లలోపు విభాగంలో ఆమె ఈ అవార్డు సాధించారు. వాల్టన్‌ హైస్కూల్‌లో సీనియర్‌ గ్రేడ్‌ చదువుతున్న రియా సొంతంగా అట్లాంటా సిటీలో ‘ఫరెవర్‌ ఎర్త్‌’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతో పాటు వ్యర్థాలను వీలైనంత మేర తగ్గిస్తూ ప్రజలు సుస్థిర జీవితాన్ని నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.

ఆమె రచించిన ‘ఇన్‌మై బ్యాక్‌ యార్డ్‌–ఎ పర్సనల్‌ స్టోరీ ఆఫ్‌ ద డివాస్టేటింగ్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ పెట్రోలియం ఆన్‌ అవర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకానమీ’పుస్తకం ఇటీవలే అట్లాంటాలో విడుదలైంది. పెట్రోలియం, చమురు పరిశ్రమల కారణంగా ఎదురవుతున్న సమస్యల గురించి ఈ పుస్తకంలో చర్చించారు. హైదరాబాద్, అట్లాంటాలో ఒక్కో విద్యార్థికి పూర్తి ట్యూషన్‌ ఫీజును భరించేలా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ను ఫరెవర్‌ ఎర్త్‌ సంస్థ స్పాన్సర్‌ చేస్తుంది. రియా తాత ఉప్పలపాటి సుబ్బారావు బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ కాగా.. ఆమె తండ్రి ఇంజనీర్‌గా, తల్లి డాక్టర్‌గా అట్లాంటాలో పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement