
జిల్లా జూనియర్ ఫుట్‌బాల్ జట్టు
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు 70 మంది హాజరయ్యారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఆదర్శకుమార్, సీనియర్ క్రీడాకారులు చందర్‌కుమార్, సతీష్, కిషోర్, రవి పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 5 నుంచి 8 వరకు మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి కె.ఆదర్శకుమార్ తెలిపారు.
జట్టు: జి.వెంకట్‌శివ, బి.వికాస్‌నాయక్, టి.బాలగంగాధర్‌తిలక్, ఐ.కృష్ణసాయి, సీహెచ్. శివకుమార్, బి.సాయిదిలీప్, జి.గోపి, బి.శరత్, డి.శ్రీపతి, బి.వంశీనాయక్, బి.పవన్‌కుమార్, పి.ఏసుపాదం, కె.బాలరాజు, ఎన్.వినయ్‌కుమార్, ఎండీ సాజిద్, ఆర్.అమర్, జె.పవన్‌కుమార్, ఐ.నోయల్‌జాక్సన్. కాగా, జట్టు మేనేజర్‌గా ఎండీ ఇమ్రాన్, కోచ్‌గా కల్యాణ్ వ్యవహరిస్తారని తెలిపారు.