ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ నూతన చీఫ్‌గా ముఫ్తీ నూర్ వలీ మెహసూద్ నియమితుడయ్యాడు. ఇటీవలే అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మృతిచెందిన ముల్లా ఫజలుల్లా స్థానంలో నూర్ ఎంపికయ్యాడు. తాలిబన్ మండలి నూర్‌ను ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపిక చేసిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఖురాసాని చెప్పారు. దక్షిణ వజీరిస్తాన్‌కు చెందిన నూర్ పలు పాకిస్తాన్ మదరసాల్లో విద్యాభ్యాసం చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వెనక తాలిబన్లు ఉన్నారని ఉర్దూలో తాను రాసిన ఓ పుస్తకంలో ప్రకటించాడు. ఆర్థిక అవసరాల కోసం తాలిబన్లు బలవంతపు వసూళ్లు, అపహరణలకు పాల్పడినట్లు ఓ సందర్భంలో నూర్ అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment