new chief
-
హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్
లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు. నయీమ్ ఖాస్సేమ్‌ను కొత్త చీఫ్‌గా నియమించినట్లు హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది. హెజ్బొల్లా చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లా ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల తర్వాత హెజ్బొల్లా తమ తదుపరి చీఫ్‌ను ప్రకటించింది.ఇక.. నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హత్య చేసినప్పటి నుంచీ నయీమ్ ఖాస్సేమ్ హెజ్బొల్లా గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉంటున్నారు. నస్రల్లాకు దీర్ఘకాలంగా డిప్యూటీగా ఉన్న నయీమ్ ఖాస్సేమ్.. నస్రల్లా మరణం అనంతరం మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నస్రల్లా స్థానంలో చీఫ్‌గా ఆయన నియామకాన్ని మంగళవారం హెజ్బొల్లా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.They used to say that the one who stays to the last is the traitor!Why wasn't Naim Qassem with all the leaders who were killed during the meetings? Now he is the head of the pyramid.#Hezbollah has appointed #naimkassem as the party's secretary general. #حزب_الله #نعيم_قاسم pic.twitter.com/KceS03tsRg— Ramez Homsi (@Ramez7m) October 29, 2024నయీమ్ ఖాస్సేమ్ ఎవరు?నయీమ్ ఖాస్సేమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలా పట్టణంలో జన్మించారు. కెమిస్ట్రీ టీచర్‌గా చాలా సంవత్సరాలు పని చేశారు. దానికంటే ముందు లెబనీస్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించిన అనంతరం.. ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్బొల్లాలో ఆయన చేరారు. 1991 నుంచి ఆయన హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌గా పనిచేశారు. -
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
-
కర్ణాటక ఫార్ములా..?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పగ్గాల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీతోపాటు విపక్షాలను దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం, అధికారంలో ఉన్న పార్టీని సమన్వయంతో నడి పించగలిగిన నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచా రం. అన్ని కోణాల్లో కసరత్తు పూర్తిచేసి ఈ నెలాఖరు కల్లా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. విధేయత, సమర్థతను పరిశీలిస్తూ: సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈనెల 27 నాటికి మూడేళ్లు పూర్తవుతోంది. పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. దీనికితోడు రేవంత్ సీఎం అయిన నేపథ్యంలో.. పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం సామాజిక వర్గాలు, విధేయత, సీనియారిటీ, కర్ణాటక ఫార్ములా తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. సమర్థుడైన నేతను పీసీసీ చీఫ్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది.ముఖ్యంగా సీనియారిటీతోపాటు పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్లపాటు ప్రభుత్వంతో, పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, విపక్షాలకు దీటుగా కౌంటర్లు ఇవ్వగలిగిన నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ కోణంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గతంలో పార్టీని నడిపించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సభ్యుడిగా పనిచేయడం నేపథ్యంలో.. ఉత్తమ్‌ను మరోమారు పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. మరోవైపు పారీ్టకి విధేయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సామాజికవర్గ కోణంలోనూ ఫోకస్.. పీసీసీ అధ్యక్ష పదవిని సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ (మాదిగ) వర్గ నేతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీలకు కాదంటే బీసీలకు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నాయి.అదే ఎస్టీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే.. సీతక్క, బలరాం నాయక్ తదితరుల పేర్లను.. మైనార్టీ కోణంలో చూస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ లేదా బీసీలకే చాన్స్ ఎక్కువనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు ఇవ్వాలనుకుంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయనను పీసీసీ చీఫ్‌గా నియమించలేని పక్షంలో ఏఐసీసీలో మంచి హోదాలో నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.మొత్తంగా సీనియారిటీ, సిన్సియారిటీ, సామాజిక వర్గాల లెక్కల్లో అన్ని అంశాలను పరిశీలించి.. ఈ నెలాఖరు కల్లా పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోనియాగాం«దీని కలిసిన సందర్భంగా కొత్త పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫార్ములాపై పరిశీలన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ విషయంలో కర్ణాటక తరహా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్‌కు ఆ అవకాశం ఇవ్వలేకపోవడంతో డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ చీఫ్ బాధ్యతలనూ అప్పగించారు. దాంతో ఆయన పారీ్టలో, ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్‌గా నిలిచారు.అదే తరహాలో తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కను పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని.. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఇలానే ఉంటాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. -
‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త చీఫ్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తమ అధినేత అబు హుస్సేన్ అల్ హుస్సెయినీ అల్ ఖురేషి మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన ఏ తేదీన విడుదలైందీ తెలియరాలేదు. అతడు ఎప్పుడు, ఎలా మృతి చెందాడనే విషయం కూడా అందులో పేర్కొనలేదు. ఐఎస్ కొత్త అధిపతిగా అబు హఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి పగ్గాలు చేపట్టనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్ పవార్?
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తదుపరి చీఫ్‌గా ఎవరు నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే తదుపరి వారుసుడిని ఎంపిక చేసేందుకు పవార్ ఏర్పాటు చేసిన కమిటీ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుందని ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ సభ్యుల్లో కమిటీ సభ్యుల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఉన్నారు. ఐతే పార్టీ జాతీయాధ్యక్షుడిగా పవార్ స్థానంలో కూతురు సుప్రియా సూలే ముందున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర చీఫ్‌గా అజిత్ పవార్ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చగ్గన్ భుజ్‌బల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇష్టపడినట్లయితే.. అజిత్ పవార్ రాష్ట్రాన్ని చూసుకుంటారని, సుప్రియా సూలే జాతీయ రాజకీయాలను చూసుకుంటారని చెప్పారు. అలాగే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల విజ్ఞప్తుల మేరకు పవార్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి అంగీకరించారని ఎన్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ చెప్పడం విశేషం. అంతేగాదు శరద్ పవార్ పదవికి రాజీనామా చేసే ప్రకటనపై తుది నిర్ణయం వెలువడేంత వరకు ఆయన వారసుడిగా పార్టీ చీఫ్‌ని ఎంపిక చేసే ప్రశ్నే లేదని పటేల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్ నిర్ణయానికి నిరసనగా పార్టీ నేతలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్టీ పవార్ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు యత్నిస్తోంది, కాబట్టి కార్యకర్తలంతా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. ఇదిలా ఉండగా..అజిత్ పవార్ పార్టీని చీల్చి, అధినేతగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ అనూహ్య చర్య తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాటు తలెత్తకుండా ఉండేలా ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, శరద్ పవార్ మాత్రం కొత్తతరం పార్టీకి మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని , అత్యాశ ఉండకూదని చెబుతూ..జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. (చదవండి: శరద్ పవార్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మోదీకి అప్పుడే చెప్పా అది కుదరని!) -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
తృణమూల్ అధినేతగా మమత ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేతగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎన్నికయ్యారు. టీఎంసీ నాయకులు బుధవారం ఆమెను పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీపై పోరాటానికి పార్టీ శ్రేణులంతా ఒక్క తాటిపైకి రావాలని ఈ సందర్భంగా మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత కలహాలను ఎంతమాత్రం సహించబోనని హెచ్చరించారు. టీఎంసీలో గ్రూపులు కడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలను మనమే గెలుచుకోవాలని, అందుకోసం ఇప్పటినుంచే కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దాం 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించడానికి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని మమతా బెనర్జీ సూచించారు. అందరం కలిసికట్టుగా బీజేపీని ఓడిద్దామని అన్నారు. తాము బెంగాల్లో సీపీఎంను సులభంగా ఓడించామని, జాతీయ స్థాయిలో బీజేపీని సైతం ఇంటికి సాగనంపడం అసాధ్యమేమీ కాదని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా మళ్లీ ఎన్నికైన అనంతరం ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకే వేదికపైకి రావాలని తాము కోరుకుంటున్నామని వెల్లడించారు. ఎవరైనా అహం(ఈగో) కారణంగా వెనకే కూర్చుండిపోవాలని అనుకుంటే అది వారిష్టమని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు. అవసరమైతే తామే ఒంటిరిగా బీజేపీపై పోరాడుతామని చెప్పారు. మేఘాలయా, చండీగఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సాయం చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్, గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ పార్టీలుగా ఎదిగినట్లుగానే పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. -
ఇండియన్ మోటార్‌సైకిల్ ‘చీఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఇండియన్ మోటార్‌సైకిల్ సరికొత్త చీఫ్ శ్రేణి మోటార్‌సైకిల్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.20.75 లక్షల నుంచి ప్రారంభం. 2022 చీఫ్ శ్రేణిలో చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. 1,890 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుపరిచారు. 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రీలోడ్ అడ్జెస్టేబుల్ రేర్ షాక్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్ కమాండ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ బైక్ ఐడియా..భలే ఉంది కదూ! -
కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగనున్న సోనియా
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా అధ్యక్షుడి ఎంపిక ఇంకా పూర్తికానందున పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె పదవీకాలం పొడిగింపు సాంకేతిక అనివార్యం మాత్రమేనని తెలిపింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు తమ పార్టీ సమాచారం అందించిందని వెల్లడించింది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతూవస్తోంది. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలగిన సంగతి తెలిసిందే. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరినా రాహుల్ దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్ 9న తాత్కాలిక చీఫ్ బాధ్యతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కట్టబెట్టింది. సోమవారంతో తాత్కాలిక చీఫ్‌గా సోనియా గడువు ముగుస్తుండటంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. సోనియా నియామకం అనంతరం మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని, అప్పటివరకూ సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతారని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వి తెలిపారు. మరోవైపు పార్టీని ముందుకునడిపేందుకు రాహుల్ గాంధీయే సరైన నేతని ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. చదవండి : ఆ పదవికి రాహులైతేనే బెస్ట్ -
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కుతీసుకునేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఆగస్టు 8 లేదా 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడే రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించడం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరగుతుందని పేర్కొన్నాయి. ఆగస్టు 15న పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడే జెండా వందనం చేస్తారన్నాయి. పార్లమెంటు సమావేశాల తరువాత సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం గురువారం ప్రకటించారు. కానీ భేటీ తేదీలను ఆయన వెల్లడించలేదు. భేటీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని చెప్పారు. కాగా, పార్లమెంటు సమావేశాలను ఆగస్టు 9న వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. -
అప్పటివరకూ అమిత్ షానే..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ చీఫ్ అమిత్ షా కొలువుతీరిన వెంటనే నూతన కమలదళాధిపతి ఎవరనే ఉత్కంఠ కాషాయ పార్టీలో నెలకొంది. అమిత్ షా స్ధానంలో పలువురి పేర్లు వినిపించినా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఊసు లేదని పార్టీ అగ్రనాయత్వం స్పష్టం చేసిందని చెబుతున్నారు. రానున్న కొద్దినెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభం వరకూ అమిత్ షానే అధ్యక్ష హోదాలో కొనసాగుతారని బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే హర్యానా, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన తర్వాతే సారథ్య బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారని చెబుతున్నారు. మరోవైపు అమిత్ షా సైతం పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో గురువారం పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి అమిత్ షా పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు హాజరయాయరు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో సంస్ధాగత ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పార్టీ నాయకత్వ మార్పు దిశగా కసరత్తును చేపడతారు. -
10 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు!
న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం ఎండీ, సీఈఓలను నియమించింది. కొత్త చీఫ్‌లలో ఐదుగురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. నియామక వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీచేసిన అధికారిక ఉత్తర్వులను క్లుప్తంగా చూస్తే... ఎస్బీఐ నుంచీ వీరు... మొండిబకాయిలతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు– ఎస్బీఐ నిపుణుల సహాయం కీలకం అని భావించిన కేంద్రం, ఎస్బీఐ నుంచి ఈ నియామకాలు చేపట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియామకాలు చూస్తే... ►ఆంధ్రాబ్యాంక్: జే. పకీర్‌సామి. 2021 ఫిబ్రవరి 28 పదవీ విరమణ వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ► సిండికేట్ బ్యాంక్: మృత్యుంజయ్ మహాపాత్ర. పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే 2020 మే 31 మహాపాత్ర ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ► ఇండియన్ బ్యాంక్: పద్మజా చంద్రూ. 2021, ఆగస్టు 31న చంద్రూ పదవీ విరమణ చేస్తారు. ► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పల్లవ్ మహాపాత్ర. 2021 ఫిబ్రవరి వరకూ ఉంటారు. ► దేనా బ్యాంక్: కర్నమ్ శేఖర్. 2020, జూన్ 30 వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇతర ఐదు బ్యాంకులనూ చూస్తే... ►అలహాబాద్ బ్యాంక్: ఎస్ఎస్ మల్లికార్జునరావు. తొలి బాధ్యతల కాలపరిమితి మూడేళ్లు. అయితే ఆయన పదవీ విరమణ సమయం 2022 జనవరి 31 వరకూ బాధ్యత కాలపరిమితిని పొడిగించే వీలుంది. ప్రస్తుతం ఆయన సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ►బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఏఎస్ రాజీవ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ కాలం మూడేళ్లు. మంచి పనితనం కనబరిస్తే, పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించవచ్చు. ►యూకో బ్యాంక్: అతుల్ కుమార్ గోయెల్. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా పనిచేస్తున్నారు. ►పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఎస్. హరి శంకర్. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అశోక్ కుమార్ ప్రధాన్, ప్రస్తుతం ఇదే బ్యాంకులో అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ స్థానిక బోర్డ్లకూ నియామకాలు... రిజర్వ్ బ్యాంక్ స్థానిక బోర్డుల సభ్యుల నియామకాలనూ కేంద్రం ప్రకటించింది. వీటిలో దక్షిణ(రాకేష్ జైన్), ఉత్తర (రేవతీ అయ్యర్, రాఘవేద్ర నారాయణ్ దుబే), తూర్పు (ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది) ప్రాంత బోర్డులు ఉన్నాయి. -
పాక్ తాలిబన్‌కు కొత్త చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ నూతన చీఫ్‌గా ముఫ్తీ నూర్ వలీ మెహసూద్ నియమితుడయ్యాడు. ఇటీవలే అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మృతిచెందిన ముల్లా ఫజలుల్లా స్థానంలో నూర్ ఎంపికయ్యాడు. తాలిబన్ మండలి నూర్‌ను ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపిక చేసిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఖురాసాని చెప్పారు. దక్షిణ వజీరిస్తాన్కు చెందిన నూర్ పలు పాకిస్తాన్ మదరసాల్లో విద్యాభ్యాసం చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వెనక తాలిబన్లు ఉన్నారని ఉర్దూలో తాను రాసిన ఓ పుస్తకంలో ప్రకటించాడు. ఆర్థిక అవసరాల కోసం తాలిబన్లు బలవంతపు వసూళ్లు, అపహరణలకు పాల్పడినట్లు ఓ సందర్భంలో నూర్ అంగీకరించాడు. -
ఎన్ఎస్ఈ కొత్త చీఫ్ విక్రమ్ లిమాయే!
త్వరలో అధికారికంగా వెల్లడి న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) కొత్త సీఈఓ, ఎండీగా విక్రమ్ లిమాయే ఎంపికయ్యారని సమాచారం. రెండు నెలల క్రితం అనూహ్యంగా ఎన్ఎస్ఈ సీఈఓ పదవి నుంచి వైదొలగిన చిత్ర రామకృష్ణన్ స్థానంలో ఐడీఎఫ్సీ చీఫ్‌గా పనిచేస్తున్న విక్రమ్ లిమాయే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. లిమాయే ఎంపికను అశోక్ చావ్లా అధ్యక్షతన గల ఎన్ఎస్ఈ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని, త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఎంపికకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అమోదం పొందాల్సి ఉంటుంది. బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) నిర్వహణకు సుప్రీమ్ కోర్టు ఇటీవల నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో విక్రమ్ లిమాయే కూడా ఒకరు. రూ.10 వేల కోట్ల ఐపీఓకు ఎన్ఎస్ఈ సన్నద్ధమవుతున్న సందర్భంలో ఆయన ఎంపిక జరగడం విశేషం. ప్రస్తుతం ఐడీఎఫ్సీ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్న విక్రమ్ లిమాయే వాణిజ్య శాస్త్రవేత్త. పెన్సిల్వేనియా యూనివర్సి టీలో వార్టన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ(ఫైనాన్స్ అండ్ మల్టీనేషనల్ మేనేజ్మెంట్) పట్టా పొందారు. 1987లో అర్థర్ అండెర్సన్ సంస్థలో తన కెరీర్ ప్రారంభించారు. ఎర్నస్ట్ అండ్ యంగ్, సిటీ బ్యాంక్ తదితర సంస్థల్లో కూడా పనిచేశారు. క్రెడిట్ సూసీ సంస్థ కోసం వాల్‌స్ట్రీట్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 2004లో ముంబైకి తిరిగి వచ్చారు. మౌలిక, ఆర్థిక, మార్కెట్, వాణిజ్యం తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ, పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ కమిటీలకు ఆయన తన సేవలందించారు.