హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ | Naim Qassem Named New Hezbollah Chief After Nasrallah Assassination | Sakshi
Sakshi News home page

హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్

Published Tue, Oct 29 2024 2:48 PM | Last Updated on Tue, Oct 29 2024 7:57 PM

Naim Qassem Named New Hezbollah Chief After Nasrallah Assassination

లెబనాన్  మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు.  నయీమ్ ఖాస్సేమ్‌ను కొత్త చీఫ్‌గా నియమించినట్లు హెజ్‌బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది. హెజ్‌బొల్లా  చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లా ఇటీవల ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల తర్వాత హెజ్‌బొల్లా తమ తదుపరి చీఫ్‌ను ప్రకటించింది.

ఇక.. నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హత్య చేసినప్పటి నుంచీ  నయీమ్ ఖాస్సేమ్ హెజ్‌బొల్లా గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉంటున్నారు. నస్రల్లాకు దీర్ఘకాలంగా డిప్యూటీగా ఉన్న  నయీమ్  ఖాస్సేమ్‌.. నస్రల్లా మరణం అనంతరం మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నస్రల్లా స్థానంలో చీఫ్‌గా ఆయన నియామకాన్ని మంగళవారం  హెజ్‌బొల్లా గ్రూప్‌ అధికారికంగా ప్రకటించింది.

నయీమ్ ఖాస్సేమ్ ఎవరు?
నయీమ్ ఖాస్సేమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలా పట్టణంలో జన్మించారు. కెమిస్ట్రీ టీచర్‌గా చాలా సంవత్సరాలు పని చేశారు. దానికంటే ముందు లెబనీస్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు.  1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించిన అనంతరం.. ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్‌బొల్లాలో ఆయన చేరారు. 1991 నుంచి ఆయన హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌గా పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement