naim
-
హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్
లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు. నయీమ్ ఖాస్సేమ్‌ను కొత్త చీఫ్‌గా నియమించినట్లు హెజ్బొల్లా ఓ ప్రకటనలో తెలిపింది. హెజ్బొల్లా చీఫ్‌గా ఉన్న హసన్ నస్రల్లా ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల తర్వాత హెజ్బొల్లా తమ తదుపరి చీఫ్‌ను ప్రకటించింది.ఇక.. నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హత్య చేసినప్పటి నుంచీ నయీమ్ ఖాస్సేమ్ హెజ్బొల్లా గ్రూప్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉంటున్నారు. నస్రల్లాకు దీర్ఘకాలంగా డిప్యూటీగా ఉన్న నయీమ్ ఖాస్సేమ్.. నస్రల్లా మరణం అనంతరం మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నస్రల్లా స్థానంలో చీఫ్‌గా ఆయన నియామకాన్ని మంగళవారం హెజ్బొల్లా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.They used to say that the one who stays to the last is the traitor!Why wasn't Naim Qassem with all the leaders who were killed during the meetings? Now he is the head of the pyramid.#Hezbollah has appointed #naimkassem as the party's secretary general. #حزب_الله #نعيم_قاسم pic.twitter.com/KceS03tsRg— Ramez Homsi (@Ramez7m) October 29, 2024నయీమ్ ఖాస్సేమ్ ఎవరు?నయీమ్ ఖాస్సేమ్ దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలా పట్టణంలో జన్మించారు. కెమిస్ట్రీ టీచర్‌గా చాలా సంవత్సరాలు పని చేశారు. దానికంటే ముందు లెబనీస్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించిన అనంతరం.. ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్బొల్లాలో ఆయన చేరారు. 1991 నుంచి ఆయన హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ-జనరల్‌గా పనిచేశారు. -
ఆసియా కప్ కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్.. వీడియో వైరల్
ఆసియాకప్-2023 మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తేరలేవనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా ఈవెంట్ కోసం సన్నద్దమవుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢాకాలోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాడు మహ్మద్ మహ్మద్ నయీమ్ మానసిక ఒత్తడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్‌లో భాగంగా నయీమ్ నిప్పులపై నడిచాడు. సబిత్ రేహాన్ ట్రైనర్ సాయంతో నయీమ్ ఈ ఫీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఫైర్వాకింగ్ను ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు చాలా కాలం నుంచి ఫాలోఅవుతున్నారు. తమ ధైర్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుందని నిపుణులు చెబుతున్నారు. కాగా సబిత్ రేహాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్లో రంగపూర్ రైడర్స్ ఆటగాళ్లకు మైండ్ ట్రైనర్‌గా పనిచేశాడు. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షేక్ హోస్ మహ్మద్, షమ్మీ అహ్మద్, నస్మీ , షోరిఫుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మొహమ్మద్ నయీమ్ చదవండి: IND vs IRE: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ధోని, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు! Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p — Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023 -
నయీమ్ అనుచరుడు శేషన్నను కోర్టులో హాజరుపర్చిన పోలీస్ లు
-
ఆ మిస్టరీల వెనుక నయీం భాయ్!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: కరుడుగట్టిన నేరగాడు... చుట్టూ మహిళా సైన్యం... టార్గెట్ చేసిన వాళ్ళను ముక్కలుగా నరికిపారేసే సంస్కృతి... గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించి ఒక్కొక్కటగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలివి. ఈ పూర్వాపరాలను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలకు నయీమ్‌తో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే రూఢీ చేయడానికి సరైన ఆధారాలు లభించాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాటి మృతదేహాల పరిస్థితులు, ఏళ్ళుగా నగర శివార్లలోనే మకాం ఉన్న నయీమ్, అతడి ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. ఆ హత్యలు–కరుడుగట్టిన నేరగాడి ప్రమేయంపై అనుమానించడానికి కారణాలు ఇవీ... కేస్–1: మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. అనుమానాలకు కారణం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన చుట్టూ ‘గడాఫీ సైన్యాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు. యువతులు, మహిళలకు వివిధ రకాలైన సాయుధ శిక్షణలు ఇచ్చి రక్షణగా పెట్టుకున్నాడు. అంతేకాదు... అనేక దారుణ హత్యల్ని సైతం వారితోనే చేయించాడు. నిత్యం అతడి వెంటే ఉండే కి‘లేడీ’ల సహకారంతోనే తన ఇంట్లో హత్య చేసిన నదీం, నస్రీన్ మృతదేహాలను కొత్తూర్, మంచిరేవుల వరకు తీసుకువెళ్ళి పడేశాడు. మెహదీపట్నం బస్టాండ్‌లో మహిళ మృతదేహంతో కూడిన సూట్‌కేస్‌ను తీసుకువచ్చింది మహిళలే. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో కలిసి టోలిచౌకి వైపు నుంచి వచ్చారు. నయీమ్ డెన్ బయటపడిన ప్రాంతాలు ఆ మార్గంలోనే ఉన్నాయి. కేస్–2: సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద 2010 డిసెంబర్ 20న ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు స్పష్టమైంది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో ఈ మృతదేహం కాళ్లు లభించాయి. దీని తల ఇప్పటికీ లభించకపోగా... కేసు సైతం కొలిక్కి రాలేదు. అనుమానాలకు కారణం: పాశవిక హత్యలకు నయీమ్ కేరాఫ్ అడ్రస్. 1996లో మావోయిస్టు ఈదన్నను చంపి ముక్కలు చేసి వేర్వేరుగా విసిరేశాడు. ఆపై బెల్లి లలితను టార్గెట్ చేసిన నయీమ్ తన అనుచరులతో దారుణంగా చంపించి 16 ముక్కలు చేయించి ఎక్కడెక్కడో పడేశాడు. రామ్‌కోఠిలో లభించిన మృతదేహం పరిస్థితీ ఇదే కావడంతో పాటు నయీమ్ డెన్స్‌లో మైనర్లు సైతం ఎక్కువ మంది ఉండే వారని, నస్రీన్ అనే 17 పని పిల్లను దారుణంగా చంపేశాడని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేస్–3: వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనుమానాలకు కారణం: నయీమ్‌కు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు వనస్థలిపురం ప్రాంతంలోనూ డెన్స్ ఉన్నాయి. ఎన్కౌంటర్ తర్వాత అక్కడి నయీమ్ అనుచరుల ఇళ్ళపై దాడులు చేసిన పోలీసులు నగదు, ఆస్తిపత్రాలతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతుడిది శివారు జిల్లాలై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ రెండు జిల్లాల్లోనూ నయీమ్‌కు విస్తృతమైన నెట్వర్క్ ఉంది. అనుచరులు, శత్రువులు, టార్గెట్లు సైతం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. -
ఎన్‌కౌంటర్‌తో కాంగ్రెస్ బెంబేలు
హన్మకొండ : నÄæ*… ఎన్‌కౌంటర్‌తో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు అన్నారు. బుధవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నÄæ*… నేర సామ్రాజ్యంపై జరుగుతున్న విచారణతో కాంగ్రెస్ నాయకుల గుట్టు బయటపడనుందన్నా రు. ఎన్కౌంటర్ అనంతరం వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి తెలంగాణ ప్రజలు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారని, కాంగ్రెస్ నాయకులకు నÄæ*… తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అతడితో ఉ్నన సంబంధాల చిట్టా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నÄæ*… తో ఎ వరికి సంబంధాలు ఉన్నాయో విచారించడడానికి హైకోర్టు ఆధీనంలో ప్రత్యే క ధర్యాప్తు (సిట్) బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రధాన మంత్రి వస్తానంటే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. ఎన్ని విమర్శలు చేసిన ఆ పార్టీ దేశంలో, రాష్ట్రంలో కోలుకోలేదన్నారు. మోదీ బ్రాహ్మణులకు దగ్గరవుతున్నాడని కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. దళితుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడా శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సురేష్. బన్న ప్రబాకర్, బింగి శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్ ఉన్నారు.