ఆసియాకప్-2023 మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తేరలేవనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనే జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా ఈవెంట్ కోసం సన్నద్దమవుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢాకాలోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది.
ఈ క్రమంలో బంగ్లా ఆటగాడు మహ్మద్ మహ్మద్ నయీమ్ మానసిక ఒత్తడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్‌లో భాగంగా నయీమ్ నిప్పులపై నడిచాడు. సబిత్ రేహాన్ ట్రైనర్ సాయంతో నయీమ్ ఈ ఫీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ఫైర్‌వాకింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు చాలా కాలం నుంచి ఫాలోఅవుతున్నారు. తమ ధైర్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుందని నిపుణులు చెబుతున్నారు. కాగా సబిత్ రేహాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో రంగపూర్ రైడర్స్ ఆటగాళ్లకు మైండ్ ట్రైనర్‌గా పనిచేశాడు. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.
ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షేక్ హోస్ మహ్మద్, షమ్మీ అహ్మద్, నస్మీ , షోరిఫుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మొహమ్మద్ నయీమ్
చదవండి: IND vs IRE: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ధోని, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు!
Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023
Comments
Please login to add a commentAdd a comment