బంగ్లాదేశ్‌పై శ్రీలంక ‘రికార్డు’ విజయం | Sri Lankas record win over Bangladesh | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ‘రికార్డు’ విజయం

Published Sun, Sep 10 2023 1:22 AM | Last Updated on Sun, Sep 10 2023 10:48 AM

Sri Lankas record win over Bangladesh - Sakshi

కొలంబో: ఆసియా కప్‌ ‘సూపర్‌ 4’లో శ్రీలంక శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో లంక 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సదీరా సమరవిక్రమ (72 బంతుల్లో 93; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కుశాల్‌ మెండిస్‌ (73 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌), నిసాంక (60 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించారు.

అనంతరం బంగ్లా 48.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్‌ హృదయ్‌ (97 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. ‘సూపర్‌ 4’ దశలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లా ఫైనల్‌ చేరే అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే!  వన్డేల్లో వరుసగా 13వ విజయం సాధించిన లంక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా మాత్రం వరుసగా 21 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. మరో వైపు వరుసగా 13 మ్యాచ్‌లలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి శ్రీలంక మరో కొత్త రికార్డు కూడా సృష్టించింది.  

స్కోరు వివరాలు: 
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (ఎల్బీ) (బి) షరీఫుల్‌ 40; కరుణరత్నే (సి) ముషి్ఫకర్‌ (బి) హసన్‌ 18; మెండిస్‌ (సి) తస్కీన్‌ (బి) షరీఫుల్‌ 50; సమరవిక్రమ (సి) (సబ్‌) అఫీఫ్‌ (బి) తస్కీన్‌ 93; అసలంక (సి) షకీబ్‌ (బి) తస్కీన్‌ 10; ధనంజయ (సి) ముషి్ఫకర్‌ (బి) హసన్‌ 6; షనక (బి) హసన్‌ 24; వెలలాగె (రనౌట్‌) 3; తీక్షణ (సి) ముషి్ఫకర్‌ (బి) తస్కీన్‌ 2; రజిత (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 257. 
వికెట్ల పతనం: 1–34, 2–108, 3–117, 4–144, 5–164, 6–224, 7–243, 8–246, 9–257.  
బౌలింగ్‌: తస్కీన్‌ 10–0–62–3, షరీఫుల్‌ 8–0–48–2, హసన్‌ 9–0–57–3, షకీబ్‌ 10–0–44–0, నసుమ్‌ 10–1–31–0, మెహదీ 3–0–14–0.  

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నయీమ్‌ (సి) మెండిస్‌ (బి) షనక 21; మెహదీ (సి) (సబ్‌) హేమంత (బి) షనక 28; దాస్‌ (సి) మెండిస్‌ (బి) వెలలాగె 15; షకీబ్‌ (సి) మెండిస్‌ (బి) పతిరణ 3; ముష్ఫికర్‌ (సి) రజిత (బి) షనక 29; హృదయ్‌ (ఎల్బీ) (బి) తీక్షణ 82; షమీమ్‌ (ఎల్బీ) (బి) తీక్షణ 5; నసుమ్‌ (బి) పతిరణ 15; తస్కీన్‌ (ఎల్బీ) (బి) తీక్షణ 1; షరీఫుల్‌ (బి) పతిరణ 7; హసన్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్‌) 236. వికెట్ల పతనం: 1–55, 2–60, 3–70, 4–82, 5–155, 6–181, 7–197, 8–200, 9–216, 10–216.  బౌలింగ్‌: రజిత 7–0–29–0, తీక్షణ 9–0–69–3, షనక 9–0–28–3, పతిరణ 9.1–1–58–3, వెలలాగె 10–1–26–1, ధనంజయ 4–0–18–0.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement