ఎన్‌కౌంటర్‌తో కాంగ్రెస్ బెంబేలు
Published Thu, Aug 11 2016 12:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హన్మకొండ : నÄæ*… ఎన్‌కౌంటర్‌తో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు అన్నారు. బుధవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నÄæ*… నేర సామ్రాజ్యంపై జరుగుతున్న విచారణతో కాంగ్రెస్ నాయకుల గుట్టు బయటపడనుందన్నా రు. ఎన్‌కౌంటర్ అనంతరం వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి తెలంగాణ ప్రజలు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారని, కాంగ్రెస్ నాయకులకు నÄæ*… తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అతడితో ఉ్నన సంబంధాల చిట్టా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
నÄæ*… తో ఎ వరికి సంబంధాలు ఉన్నాయో విచారించడడానికి హైకోర్టు ఆధీనంలో ప్రత్యే క ధర్యాప్తు (సిట్) బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రధాన మంత్రి వస్తానంటే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. ఎన్ని విమర్శలు చేసిన ఆ పార్టీ దేశంలో, రాష్ట్రంలో కోలుకోలేదన్నారు. మోదీ బ్రాహ్మణులకు దగ్గరవుతున్నాడని కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. దళితుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడా శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సురేష్. బన్న ప్రబాకర్, బింగి శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్ ఉన్నారు.
Advertisement