లెబనాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందిని టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సైనికుల సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా విధులు ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు.
‘‘హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ(UNIFIL) సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం కృషి చేస్తోంది. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ పదేపదే కోరుతోంది. హెజ్‌బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌లోకి దాడులో ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని యూఎన్‌ఎఫ్‌ఐఎల్ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను.
.. మా పోరాటం యూఎన్‌ఎఫ్‌ఐఎల్, లెబనాన్ ప్రజలతో కాదు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్‌బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది. మా హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్‌లో హెజ్‌బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment