
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తమ అధినేత అబు హుస్సేన్ అల్ హుస్సెయినీ అల్ ఖురేషి మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన ఏ తేదీన విడుదలైందీ తెలియరాలేదు. అతడు ఎప్పుడు, ఎలా మృతి చెందాడనే విషయం కూడా అందులో పేర్కొనలేదు. ఐఎస్ కొత్త అధిపతిగా అబు హఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి పగ్గాలు చేపట్టనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు.