ISIS Leader
-
‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త చీఫ్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తమ అధినేత అబు హుస్సేన్ అల్ హుస్సెయినీ అల్ ఖురేషి మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన ఏ తేదీన విడుదలైందీ తెలియరాలేదు. అతడు ఎప్పుడు, ఎలా మృతి చెందాడనే విషయం కూడా అందులో పేర్కొనలేదు. ఐఎస్ కొత్త అధిపతిగా అబు హఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి పగ్గాలు చేపట్టనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
జైలుకు పంపడానికి ట్రక్కును తెప్పించారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మొసుల్‌లో పట్టుబడిన ఐసిస్ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్ నిమను జైలుకు తరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. 130 కిలోలకు పైగా బరువున్న షిఫల్ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఐఎస్ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐసిస్ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్ నిమ జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్ పోలీసులు పేర్కొన్నారు. నిమ పట్టుబడటం ఐసిస్‌కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాగా. 2013లో పురుడు పోసుకున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద గ్రూపు తమ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాది హతమైనా ప్రపంచానికి పెనుముప్పుగానే పరిణమించింది. చదవండి : రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ -
ఆపరేషన్ అల్ బాగ్దాది!
-
ఐసిస్ చీఫ్ పారిపోయాడు..
-
ఐసిస్ చీఫ్ పారిపోయాడు..
బాగ్దాద్: ఇరాక్‌లోని మోసుల్ నగరం నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఐఎస్ ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియోను గురువారం విడుదల చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మోసుల్ కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకముందని, ఇరాక్ భద్రత దళాలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బాగ్దాదీ తన అనుచరులను ఆదేశించాడు. ఇరాక్ దళాలను ఎదుర్కోవడంలో వెనుకంజవేయవద్దని సూచించాడు. దీన్నిబట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మోసుల్ నగరం 2014 నుంచి ఐఎస్ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉంది. ఈ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం కోసం ఇరాక్ భద్రత బలగాలు పోరాటం చేస్తున్నాయి. దీంతో భద్రత దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఉగ్రవాదులు.. పిల్లలు, మహిళలు సహా వేలాదిమందిని బంధించి, ఇరాక్ భద్రత బలగాలతో పోరాటంలో వారిని మానవ కవచాల్లా వాడుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మోసుల్ నగరంలో 3 వేలమంది నుంచి 5 వేలమంది వరకు ఐఎస్ ఉగ్రవాదులు ఉండవచ్చని అమెరికా సంకీర్ణ దళాలు అంచనా వేస్తున్నాయి.