జాతీయ జూడోకు గైట్‌ విద్యార్థుల ఎంపిక | national judo compettions selected | Sakshi
Sakshi News home page

జాతీయ జూడోకు గైట్‌ విద్యార్థుల ఎంపిక

Published Thu, Oct 27 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

national judo compettions selected

వెలుగుబంద (రాజానగరం) :
హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో నవంబరు మొదటి వారంలో జరగనున్న జాతీయ స్థాయి అంతర్‌ విశ్వవిద్యాలయాల జూడో పోటీల్లో పాల్గొనే జట్టుకు గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. బీటెక్‌ మెకానికల్‌ ఫైనలియర్‌ చదువుతున్న ఈ ఇద్దరూ జేఎ¯ŒSటీయూకే తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.సూర్యనారాయణరాజు తెలిపారు. 60 కిలోల విభాగంలో పీవీ తేజ వరుసగా నాలుగో సంవత్సరం వర్సిటీ తరఫున పాల్గొంటుండగా.. 80 కిలోల విభాగంలో పి.అజయ్‌కుమార్‌ రెండోసారి పాల్గొంటున్నారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంíపికైన విద్యార్థులు కూడా వీరిద్దరేనన్నారు. విద్యార్థులకు, పీడీ రమణబాబుకు, హెచ్‌ఓడీ కేఎల్‌ఎ¯ŒS మూర్తిలకు అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement