compettions
-
ఉత్సాహంగా బాడీబిల్డింగ్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ) : స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలో సోమవారం బాడీబిల్డింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ‘మిస్టర్ కాకినాడ’ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు యువకులు పాల్గొని, తమ శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించారు. విజేతకు రూ.5 వేల ప్రైజ్‌మనీ, ప్రసంసాపత్రం అందజేస్తామని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సన్యాసినాయుడు తెలిపారు. -
జాతీయ జూడోకు గైట్ విద్యార్థుల ఎంపిక
వెలుగుబంద (రాజానగరం) : హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో నవంబరు మొదటి వారంలో జరగనున్న జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల జూడో పోటీల్లో పాల్గొనే జట్టుకు గైట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న ఈ ఇద్దరూ జేఎ¯ŒSటీయూకే తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు తెలిపారు. 60 కిలోల విభాగంలో పీవీ తేజ వరుసగా నాలుగో సంవత్సరం వర్సిటీ తరఫున పాల్గొంటుండగా.. 80 కిలోల విభాగంలో పి.అజయ్‌కుమార్ రెండోసారి పాల్గొంటున్నారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంíపికైన విద్యార్థులు కూడా వీరిద్దరేనన్నారు. విద్యార్థులకు, పీడీ రమణబాబుకు, హెచ్ఓడీ కేఎల్ఎ¯ŒS మూర్తిలకు అభినందనలు తెలిపారు. -
ఫుట్‌బాల్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
గొల్లప్రోలు : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మాధురి విద్యాలయకు చెందిన విద్యార్థి కొశిరెడ్డి గణేశ్వరరావు ప్రతిభ కనబరిచాడు. ఇటీవల నరసరావుపేటలో అండర్ 14 విభాగంలో జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొన్నాడు. ఆటలో ప్రతిభ కనబరచినందుకు ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు మెమెంటో, సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థినిని మాధురి విద్యాలయ కరస్పాండెంట్ కడారి తమ్మయ్యనాయుడు, ప్రిన్సిపాల్ ఎంఎం లూకోస్ అభినందించారు.