పెద్దిరెడ్డి రాజా, రాంరెడ్డిని సన్మానిస్తున్న నాయకులు
సూర్యాపేటరూరల్ : టీడీపీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన నాతాల రాంరెడ్డి నియామకమైనట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా వెల్లడించారు. బుధవారం అంజనాపురి కాలనీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు నాతాల రాంరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇప్పటికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో సూర్యాపేట నియోజకర్గంలోనూ మొదలు పెడతామన్నారు. ఈ నెల 29న నిర్వహించే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం చౌడోజు వీరాచారి ఆధ్వర్యంలో గజమాలతో రాంరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాల అధ్యక్షుడు కుంచం అంజయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, పగడాల లింగయ్య, శంకర్‌నాయక్, వంశీ, జానిమియా, జితేందర్, మోహన్, రామాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment