
బెన్ స్టోక్స్
లండన్: సొంతగడ్డపై భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కింది. పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. జూలై 12 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మందితో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించారు. వన్డేలకు ముందు జరిగే మూడు టి20ల సిరీస్‌కు మాత్రం అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సిరీస్‌లో తొలి వన్డే జూలై 12న ట్రెంట్ బ్రిడ్జ్‌లో, రెండో వన్డే జూలై 14న లార్డ్స్‌లో, మూడో వన్డే జూలై 17న హెడింగ్లేలో జరుగనున్నాయి.
ఇంగ్లండ్ వన్డే జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జాక్ బాల్, బట్లర్, కరన్, హేల్స్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, రూట్, రాయ్, స్టోక్స్, విల్లీ, మార్క్ వుడ్.
Comments
Please login to add a commentAdd a comment