England all-rounder Ben Stokes
-
భారత్‌తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న స్టోక్స్
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురవుతున్న తాను, కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత్‌తో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అతను ఆడబోవడం లేదు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్’ల కారణంగా స్టోక్స్ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు. స్టోక్స్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ను ఇంగ్లండ్ జట్టులోకి ఎంపిక చేశారు. -
ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టోక్స్
లండన్: సొంతగడ్డపై భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కింది. పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. జూలై 12 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మందితో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించారు. వన్డేలకు ముందు జరిగే మూడు టి20ల సిరీస్‌కు మాత్రం అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సిరీస్‌లో తొలి వన్డే జూలై 12న ట్రెంట్ బ్రిడ్జ్‌లో, రెండో వన్డే జూలై 14న లార్డ్స్‌లో, మూడో వన్డే జూలై 17న హెడింగ్లేలో జరుగనున్నాయి. ఇంగ్లండ్ వన్డే జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జాక్ బాల్, బట్లర్, కరన్, హేల్స్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, రూట్, రాయ్, స్టోక్స్, విల్లీ, మార్క్ వుడ్. -
రూ. 84 లక్షలు కోల్పోనున్న స్టోక్స్!
లండన్: ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 14 కోట్ల 50 లక్షలు)కు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అందులో కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనల ప్రకారం కౌంటీలతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు ఆ జట్టు మ్యాచ్‌లలో పాల్గొనకపోతే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం అతని కాంట్రాక్ట్ మొత్తంలో నుంచి ఒక్కో రోజుకు 0.5 శాతం (సుమారు 3,500 పౌండ్లు) చొప్పున కోత విధిస్తారు. దీని ప్రకారం ఐపీఎల్లో స్టోక్స్ ఆడినన్ని రోజుల ప్రకారం డబ్బు వెనక్కి ఇవ్వాలి. స్టోక్స్ భారత్‌లో ఉండేందుకు అవకాశం ఉన్న 28 రోజులకు ఈ మొత్తం దాదాపు లక్ష పౌండ్లు (రూ. 84 లక్షలు) అవుతుంది. రూ.12 కోట్లు దక్కిం చుకున్న మరో ఇంగ్లండ్ ఆటగాడు టైమల్ మిల్స్ మాత్రం అన్ని ఫార్మాట్లలో ఆడే కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడు కాకపోవడంతో అతనికి ఈ సమస్య లేదు. అలారం పెట్టుకొని... ఇటీవలి భారత్ పర్యటనలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన సూపర్ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్–10 ఆటగాళ్ల వేలంలో తను హాట్‌కేకులా మారతాడని ముందే అందరూ ఊహించారు. అయితే ఇతడిపై ఏకంగా రూ.14.5 కోట్ల రికార్డు ధరను వెచ్చించి కొనుగోలు చేస్తారని మాత్రం అనుకోలేదు. నిజానికి ఈ ధర అటు స్టోక్స్‌ను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా ఓ విదేశీ ఆటగాడికి దక్కిన అత్యధిక మొత్తం. అటు ఈ వేలాన్ని చూసేందుకు తెల్లవారుజామున 3.30 గంటలకే అలారం పెట్టుకుని లేచానని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోతున్న స్టోక్స్ తెలిపాడు. ‘వేలం కోసం ఉత్సాహంగా తెల్లవారే అలారం పెట్టుకుని లేచాను. నా వంతు వచ్చేవరకు 40 నిమిషాలసేపు ఓపిగ్గా ఎదురుచూశాను. అయితే టీవీలో ప్రత్యక్షంగా చూడలేకపోయాను. అందుకే ట్విట్టర్లో ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ట్వీట్స్‌ను అప్డేట్ చేస్తుంటే తెలిసింది.. నన్ను పుణే జట్టు తీసుకుందని. నా కనీస ధరకు ఏడు రెట్లు ఎక్కువగా లభించడంతో ఆశ్చర్యపోయాను. దీనిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నిజంగా ఇది జీవితాన్ని మార్చే మొత్తం. ఇంతకుమించి ఆశించలేను. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. అయితే నా ధరకు తగ్గట్టుగా ఆడి జట్టుకు విజయాలు అందించాలనుకుంటున్నాను’ అని స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు.