
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇంద్రపాలనగరం(రామన్నపేట)
ఇబ్రహీంపట్నంలో ఈ నెల 9, 10తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఇంద్రపాలనగరం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీన జిల్లాకేంద్రంలోని విశ్వదీప్‌పాఠశాలలో జరిగిన సెలక్షన్స్‌లో అండర్–17 విభాగంలో ఏర్వ మౌనిక, మల్లల కార్తీక్‌లు ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైన విద్యార్థులను, కషిచేసిన పీఈటీ ఎస్.శీనయ్యను సర్పంచ్ పూస బాలనర్సింహ, ఎంపీటీసీ మంటి సరోజ, ఎస్‌ఎంసీచైర్మెన్ రవ్వ వెంకటేశం, ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి, సీనియర్ ఉపాధ్యాయుడు శివగల్ల నర్సింహ అభినందించారు.