compition
-
‘కర్మను నీతోనే మోసుకెళ్లడం అంటే ఇదే’
ముంబై: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తనదైన శైలీలో ట్వీటర్ వేదికగా ఓ పోటీని ప్రకటించారు. గెలిచిన అభ్యర్థికి మహీంద్రా వాహనాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. పోటీ... దాని వివరాలు ఏంటో చూడండి. బస్సుపై.. రివర్స్‌లో మరో బస్సు పెట్టినట్లు ఉన్న వాహనం ఫోటోను ఒకదాన్ని మంగళవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ బస్సుకు సరిగా సరిపోయే క్యాప్షన్‌ని ఇవ్వాలని కోరారు. హిందీ, ఇంగ్లీష్, హింగ్లీష్ ఏదో ఒక భాషలో క్యాప్షన్ ఉండాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు ఎంట్రీలను స్వీకరిస్తామని తెలిపారు. ఈ క్యాప్షన్ కాంపిటీషన్‌కు నెటిజనులు తెగ స్పందిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కొద్ది గంటల్లోనే 5000 లైక్‌లు, వందల్లో రీ ట్వీట్లు సంపాదించింది. It’s been a while since I did a caption competition. So here goes. The perfect weird picture to create a caption for. In English or Hindi...or Hinglish.. Will accept entries till 10 am tomorrow IST. And as always, the winner will get a die-cast scale model of a Mahindra vehicle. pic.twitter.com/udtG5YAVVa — anand mahindra (@anandmahindra) September 17, 2019 నెటిజనులు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయంటే.. ‘ట్రబుల్ డెక్కర్’.. ‘ఢిల్లీలోని సరి-బేసి విధానానికి ఈ వాహనం సరిగా సరిపోతుంది’.. ‘నీ కర్మను నువ్వే మోయడం’.. ‘ఉల్టా పల్టా’.. ‘కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే’ అంటూ రకారకాల క్యాప్షన్లు పంపిస్తున్నారు నెటిజన్లు. మరి ఆనంద్ మహీంద్రా ఎవర్ని విజేతగా ప్రకటిస్తారో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. కుదిరితే ఈ లోపు మీరు కూడా మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. -
తమిళ పొన్నుకే మిస్ ఇండియా కిరీటం
చెన్నై, తమిళనాడు : ‘మిస్ ఇండియా పోటీ’...దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ పోటీల్లో ఈ ఏడాది కిరీటం ‘తమిళ పొన్ను’ అనుకృతి వాస్‌ను వరించింది. నిన్న రాత్రి ముంబై డోమ్‌లోని ‘ఎన్ఎస్సీఐ ఎస్వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్‌లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా’గా ఎన్నికైంది. గతేడాది ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన మానుషి చిల్లర్, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీకి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘మాజీ మిస్ వరల్డ్’ స్టెఫానియే డెల్ వాలి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కాగా ‘మిస్ ఇండియా - 2018’ పోటీలో మొదటి రన్నరప్‌గా ‘మిస్ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్‌గా ‘మిస్ ఇండియా’ ఆంధ్రపదేశ్‌కు చెందిన శ్రేయా రావ్ కామవరపు నిలిచింది. ప్రస్తుతం అనుకృతి వాస్ ‘మిస్ వరల్డ్ - 2018’ కోసం సిద్ధమవుతుంది. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇంద్రపాలనగరం(రామన్నపేట) ఇబ్రహీంపట్నంలో ఈ నెల 9, 10తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఇంద్రపాలనగరం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీన జిల్లాకేంద్రంలోని విశ్వదీప్పాఠశాలలో జరిగిన సెలక్షన్స్‌లో అండర్–17 విభాగంలో ఏర్వ మౌనిక, మల్లల కార్తీక్‌లు ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైన విద్యార్థులను, కషిచేసిన పీఈటీ ఎస్.శీనయ్యను సర్పంచ్ పూస బాలనర్సింహ, ఎంపీటీసీ మంటి సరోజ, ఎస్ఎంసీచైర్మెన్ రవ్వ వెంకటేశం, ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి, సీనియర్ ఉపాధ్యాయుడు శివగల్ల నర్సింహ అభినందించారు. -
అట్టహాసంగా క్రీడాపోటీలు
అయిజ : ఉత్తనూరు గ్రామంలో క్రీడాదినోత్సవం సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో టీఆర్ఎస్ నాయకులు ఉత్తనూరు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు విద్యార్థులు, పీఈటీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చైర్పర్సన్ రాజేశ్వరి, సింగిల్‌విండో ప్రెసిడెంట్ రామముడు, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ నాగేంద్ర, ఎంఈఓ గిరిధర్, వైస్ ఎంపీపీ నీలకంఠరెడ్డి, వ్యవసాయ అధికారి శంకర్‌లాల్ హాజరయ్యారు. ముందుగా జాతీయజెండా, క్రీడల జెండాలను ఆవిష్కరించారు. విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పిరమిడ్ ఆకారంలో కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. ప్రతిభను వెలికితీసేందుకే: తిరుమల్‌రెడ్డి అనంతరం టీఆర్ఎస్ నాయకులు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల బాల బాలికలతో మూడురోజులపాటు అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రత్సహించాలని, క్రీడాకారులకు చేయూతనందించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి సానెపట్టాలని కోరారు. అనంతరం కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో క్రీడాపోటీలను ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీల్లో అన్ని పాఠశాలల విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. క్రీడాపోటీలను చూసేందుకు ప్రజలు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్ మినీస్టేడియం కిక్కిరిసిపోయింది.