‘కర్మను నీతోనే మోసుకెళ్లడం అంటే ఇదే’ | Anand Mahindra Hosts Caption Competition on Twitter | Sakshi
Sakshi News home page

సరి - బేసి విధానానికి ఇది బాగా సూట్‌ అవుతుంది

Published Tue, Sep 17 2019 8:29 PM | Last Updated on Tue, Sep 17 2019 8:35 PM

Anand Mahindra Hosts Caption Competition on Twitter - Sakshi

ముంబై: సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తనదైన శైలీలో ట్వీటర్‌ వేదికగా ఓ పోటీని ప్రకటించారు. గెలిచిన అభ్యర్థికి మహీంద్రా వాహనాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. పోటీ... దాని వివరాలు ఏంటో చూడండి. బస్సుపై.. రివర్స్‌లో మరో బస్సు పెట్టినట్లు ఉన్న వాహనం ఫోటోను ఒకదాన్ని మంగళవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ఈ బస్సుకు సరిగా సరిపోయే క్యాప్షన్‌ని ఇవ్వాలని కోరారు. హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌ ఏదో ఒక భాషలో క్యాప్షన్‌ ఉండాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు ఎంట్రీలను స్వీకరిస్తామని తెలిపారు. ఈ క్యాప్షన్‌ కాంపిటీషన్‌కు నెటిజనులు తెగ స్పందిస్తున్నారు. ఆనంద్‌ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌ కొద్ది గంటల్లోనే 5000 లైక్‌లు, వందల్లో రీ ట్వీట్‌లు సంపాదించింది.
 

నెటిజనులు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయంటే.. ‘ట్రబుల్‌ డెక్కర్‌’.. ‘ఢిల్లీలోని సరి-బేసి విధానానికి ఈ వాహనం సరిగా సరిపోతుంది’.. ‘నీ కర్మను నువ్వే మోయడం’.. ‘ఉల్టా పల్టా’.. ‘కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే’ అంటూ రకారకాల క్యాప్షన్లు పంపిస్తున్నారు నెటిజన్లు. మరి ఆనంద్‌ మహీంద్రా ఎవర్ని విజేతగా ప్రకటిస్తారో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. కుదిరితే ఈ లోపు మీరు కూడా మీ సృజనాత్మకతకు పదును పెట్టండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement