ఫ్రాన్స్‌ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్‌ గుబులు | France Elections 2024: Exit Polls Set Back For President Macron | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ పార్లమెంటరీ ఎన్నికలు: అధ్యక్షుడు మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్‌ గుబులు

Published Mon, Jul 1 2024 8:42 AM | Last Updated on Mon, Jul 1 2024 11:35 AM

France Elections 2024: Exit Polls Set Back For President Macron

పారిస్‌: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్‌  పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్‌ పోలింగ్‌ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం మెక్రాన్‌ నేతృత్వంలోని సెంట్రిస్ట్‌ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

ఆదివారం ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్‌ పోలింగ్‌ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మెరైన్‌ లే పెన్‌కు చెందిన నేషనల్‌ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్‌ఎన్‌ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. 

 మెక్రాన్‌ నేతృత్వంలోని సెంట్రిస్ట్‌ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్‌ రావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. 

ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్‌ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement