నోటర్‌ డామ్‌కు రూ.7 వేల కోట్ల విరాళాలు | 7,000 crore donations for Notre Dame Cathedral church | Sakshi
Sakshi News home page

నోటర్‌ డామ్‌కు రూ.7 వేల కోట్ల విరాళాలు

Published Thu, Apr 18 2019 3:10 AM | Last Updated on Thu, Apr 18 2019 3:10 AM

7,000 crore donations for Notre Dame Cathedral church - Sakshi

ప్రమాదంలో ధ్వంసమైన చర్చి కట్టడం

ప్యారిస్‌: అగ్నికి ఆహుతైన ప్యారిస్‌లోని ప్రఖ్యాత చర్చి నోటర్‌ డామ్‌ కెథడ్రల్‌ పునర్నిర్మాణ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గానూ సుమారు రూ.7 వేల కోట్ల విరాళాలు వసూలయ్యాయి. అయితే ఈ కట్టడంపునర్నిర్మాణానికి గానూ ఐదేళ్లు పడుతుందంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రోన్‌ ప్రకటించారు. బుధవారం ఉదయం నిర్మాణ బృందాలు భారీ క్రేన్‌తో పాటు అవసరమైన చెక్క సామగ్రితో నోటర్‌ డామ్‌కు చేరుకున్నాయి. సోమవారం నోటర్‌ డామ్‌కు మంటలు అంటుకొని పైకప్పు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే.  ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement