ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. ఇక్కడి కళాకారుల హస్తకళలు, భాదోహి కార్పెట్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బనారసీ చీరల ప్రత్యేకత గురించి మాక్రాన్‌కు మోదీ వివరించారు. అనంతరం డీడీయూ ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన చిత్రకూట్ నాటకాన్ని (రాముడి 14ఏళ్ల వనవాసాన్ని ప్రతిబింబించే) తిలకించారు.