
మృతిచెందిన గ్రాచవ్ దిమిత్రి
మల్కాపురం (విశాఖ పశ్చిమ): రష్యా నుండి వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. సంఘటనకు సంబంధించి మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ నౌకలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వాటిని సరిచేసేందుకు ఆయనను ఇక్కడికి పిలిపించారు. దిమిత్రి యారాడ డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్‌లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం నౌకలో పనులు చేస్తుండగా మ.1.15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను ఐఎన్‌ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ.2.45 గంటలకు మృతిచెందారు. నేవల్ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి పార్టీలకు.. వచ్చి చూస్తే..)
Comments
Please login to add a commentAdd a comment