
మహిళలు పిల్లలను కనడం కంటే విద్య, భవిష్యత్తుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇది సరైన పద్దతి కాదంటూ రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో మృతుల సంఖ్య కంటే జననాల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ దేశ దిగువ సభలోని ప్లీనరీ సమావేశంలో మురాష్కో మాట్లాడారు.
మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి, ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం సమాజంలో బాగా నాటుకుపోయిందన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మహిళలు పిల్లల్ని కనడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆలస్యంగా పిల్లలను కనడం అనేక అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
చదవండి: పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు
లేటుగా సంతానం కోసం ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న మంత్రి.. ఈ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్రావాల కోసం వాడే ఔషధాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment