విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్' | Russian Woman Sunbathing by Hanging Out Her Apartment Window Has Neighbors on Edge | Sakshi
Sakshi News home page

విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'

Published Thu, Jul 7 2016 11:16 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్' - Sakshi

విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'

రష్యాః సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, తీర ప్రాంతాలకు వెడుతుంటారు. అవకాశం లేనివారు కొందరు.. బాల్కనీల్లోనూ, అపార్ట్ మెంట్లు, భవనాల టెర్రస్ లను సన్ బాత్ కు వినియోగించుకుంటారు. అయితే అసలు బయటకు వెళ్ళే పనే లేదంటోంది ఓ రష్యన్ మహిళ. బికిని ధరించి, ప్రతిరోజూ కిటికీ నుంచీ వచ్చే ఎండనే సన్ బాత్ కు వినియోగించుకుంటూ చుట్టుపక్కల వారిని విస్మయపరుస్తోంది. రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యాపట్టణం నోవోసిబిర్స్క్ క్రోపోట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీనుంచీ ప్రతిరోజూ కనిపించే సన్ బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఇబ్బందులకు గురిచేస్తోంది.  అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివసించే మహిళ.. బికినీ ధరించి, తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తూ చూపరులను అకట్టుకోవడమేకాదు.. ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, పార్క్ లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో అందరికీ  తెలిసేట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు అక్కడి వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే కొందరు కాలనీవాసులు మాత్రం ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అక్కడే చిన్న పిలలు అడుకుంటుంటారని, సదరు మహిళ ఎక్స్ పోజింగ్ ను తట్టుకోలేకపోతున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆమె విండో సన్ బాత్ ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్ ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్ కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు సన్ బాతర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంత సమయం విండో సన్ బాత్ చేస్తూనే ఉంది. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఆమె ఇలా కాళ్ళు, నడుమువరకూ బయటకు పెట్టి ఎక్స్ పోజ్ చేయడం మొదటిసారి కాదని, బాడీ మొత్తం సమాంతరంగా ట్యాన్ అయ్యేందుకు, శరీర పై భాగాన్ని కూడ ఎండలో బయటకు పెట్టేదని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు  పూర్తి శాతం బికినీతో  ఉండేదని మరి కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు అంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ సన్ బాత్ సుందరి మాత్రం.. తన రోజువారీ కార్యక్రమాన్ని ఆపేట్టు కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement