out
-
హైదరాబాద్ అంతా చుట్టేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
ఈగల్...ఆన్ హిజ్ వే!
రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్యా థాపర్ మరో కథానాయిక. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9న విడుదల కానుంది. శుక్రవారం (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఈగల్’ సినిమాలోని ‘ఈగల్స్ ఆన్ హిజ్ వే.. ఇట్స్ టైమ్ టు డై...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు దేవ్ జాంద్ నేతృత్వంలో ఈ పాటకు ఇంగ్లిష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూయే ఆలపించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. -
ఆస్కార్ రేసు నుంచి 2018 చిత్రం అవుట్
భారతీయ సినీ ప్రేమికులకు నిరాశ ఎదురైంది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన మలయాళ సినిమా ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో భాగంగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా మొత్తం పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్ బరిలో ఉన్న షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు మేకర్స్. హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ, ఓపెన్ హైమర్’ల హవా ఈ షార్ట్‌లిస్ట్ జాబితాలో కనిపించింది. ఇక ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం 88 దేశాల చిత్రాలు పోటీ పడగా, 15 చిత్రాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ లిస్ట్‌లో మలయాళ ‘2018’ సినిమాకు చోటు దక్కలేదు. కాగా ఇండో–కెనెడియన్ ఫిల్మ్‌మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘టు కిల్ ఏ టైగర్’ అవార్డ్స్లతో సత్తా చాటింది. జార్ఖండ్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన తన కుమార్తెకు న్యాయం జరగాలని ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ కథనం ఉంటుంది. అస్కార్ నామినేషన్ కోసం పదిహేను డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్స్‌తో ‘టు కిల్ ఏ టైగర్’ పోటీ పడాల్సి ఉంది. ఇక అన్ని విభాగాల్లోని ఆస్కార్ నామినేషన్స్ జనవరి 23న వెల్లడి కానున్నాయి. ఇందుకోసం జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆస్కార్‌లోని పది విభాగాల షార్ట్ లిస్ట్ జాబితాలో ఒక్క ఇండియన్ చిత్రానికి కూడా చోటు లభించలేదు. ఇక ‘2018’ విషయానికొస్తే కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. టొవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, వినీత్, తన్వి రామ్, అజు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం వసూలు చేసింది. ఆస్కార్ బరిలో నిలిచి నామినేషన్ దక్కించుకోలేకపోయిన నాలుగో మలయాళ చిత్రంగా ‘2018: ఏవ్రీ వన్ ఏ హీరో’ చిత్రం నిలిచింది. గతంలో 70వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘గురు (1997)’, 83వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘అదామింటే మకాన్ అబు (2011)’, 93వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ‘జల్లికట్టు (2019)’, 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘2018: ఏవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ చిత్రాలను ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీకి పంపింది. -
Viveka Case: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్ టేక్ అవుట్ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితుడు సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్‌కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. తూచ్.. అంతా ఉత్తిదే కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నది గ్రీన్విచ్ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్ పేరిట బురిడీకి యత్నం! కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ టేక్ అవుట్ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు. స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్ యాదవ్ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్ యాదవ్ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఒక్క ఆధారం లేదే.. గూగుల్ టేక్ అవుట్ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్‌షీట్‌లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అసలు సునీల్ యాదవ్ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్‌షీట్‌లో పేర్కొంది. హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్ యాదవ్.. ఆ రోజు రాత్రి భాస్కర్‌రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్‌రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగానే వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది. అదే గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్ కుమార్‌రెడ్డే చెప్పారు. మరి దాన్ని ఏదో గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్‌షీట్‌లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. మిగిలిన నిందితుల గూగుల్ టేక్ అవుట్ డేటా లేదా? సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి మొబైల్ ఫోన్ల గూగుల్ టేక్ అవుట్ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్ ఫోన్ల గూగుల్ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ ఆశించనే లేదు ‘మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది. వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్‌కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు. ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. -
మహేష్ బాబు మూవీ నుంచి శ్రీలీల అవుట్
-
కరోనా : టాప్-10 నుంచి స్టాక్ మార్కెట్ ఔట్
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని భారతీయ స్టాక్ మార్కెట్ టాప్-10 స్టాక్ మార్కెట్ల జాబితా నుంచి పడిపోయింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆందోళన నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ టాప్ 10 జాబితానుంచి, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్ నుంచి తప్పుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్టానికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం ఈక్విటీ మార్కెట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, సంవత్సరం ప్రారంభం నుండి డాలర్ పరంగా 27.31శాతం పడిపోయింది. 1.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాప్ తో 11 వ స్థానానికి పడిపోయింది. 2019 జనవరిలో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఏడవ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా గత జనవరిలో 2.16 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశం 10 వ స్థానానికి చేరింది. తాజాగా కోవిడ్ -19 విలయంతో 10 స్థానాన్ని కూడా కోల్పోయింది. (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్) బెంచ్‌మార్క్ సూచికలు అతిపెద్ద వన్డే క్షీణతను నమోదు చేసిన మార్చి 23 న భారత్ టాప్ 10 జాబితాలో పడిపోయింది, ఈ రోజు భారతదేశం మొత్తం మార్కెట్ క్యాప్ డాలర్ పరంగా 31 1.31 ట్రిలియన్లు . రూపాయి పరంగా రూ.101.87 ట్రిలియన్లు. అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 21.74 శాత తగ్గి 121.73 ట్రిలియన్ చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 155.54 ట్రిలియన్లు. (‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్) సిఎల్ఎస్ఎ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత 30 ఏళ్లలో భారతీయ మార్కెట్లలో 40శాతం నమోదు చేయడం ఇది ఐదవ సారి. భారతదేశంలో రికార్డు స్థాయిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. భారతదేశం బెంచ్మార్క్ఇండెక్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 29.10శాతం(డాలర్ల పరంగా) కోల్పోయింది ఈ సంవత్సరం ప్రారంభంనుండి 24 శాతం కుప్ప కూలడంతో మొత్తం మార్కెట్ క్యాప్ నష్టానికి దారితీసింది. 2019 లో 11.91 శాతం పెరిగింది. మొత్తం ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో భారతదేశం2.18శాతంఉండగా, 2019 ప్రారంభంలో ఇది 2.97శాతం గా ఉంది. 2020లో ఇప్పటివరకు, ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం విలువలో 17.15 శాతం క్షీణించాయి. 86.99 ట్రిలియన్ నుండి 72.07 ట్రిలియన్లకు చేరాయి. అయితే కోవిడ్ -19 కు కేంద్రంగా ఉన్న చైనా 2020లో ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.36 శాతం లేదా 7.24 ట్రిలియన్ల డాలర్లు నష్టపోయింది. 29.34 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అమెరికా తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2020లో 30.09 శాతం కోల్పోయిన యుకె, 2.44 ట్రిలియన్ డాలర్ల (మార్కెట్ క్యాప్)తో ఐదవ స్థానంలో ఉంది. (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం) రూపాయి పతనం : ఆసియాలో భారతీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. వరుస రికార్డు కనిష్టాలతో ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోలిస్తే 6.64 శాతం బలహీనపడింది. ఏప్రిల్ మాసంలో భారత కరెన్సీ 76.92 కనిష్ట స్థాయిని తాకింది. ఇదే సమయంలో డాలర్ 4.14 శాతం లాభపడడం గమనార్హం. (కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు) అంబిట్ క్యాపిటల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల ఉద్దాన పతనాలు సాధారణమే అనేది 100 సంవత్సరాల చరిత్ర చెబుతోంది. దశాబ్దంలో ఏదో ఒక సంఘటన 35 శాతం పతనానికి దారి తీస్తుంది. నష్టాల్లో మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంటు దెబ్బతింటుంది. ఆందోళనతో అమ్మకాలకు పాల్పడతారు. ఫలితంగా ఆర్థిక మాంద్యం, ఉద్యోగ మాంద్యం, వేతనాల కోతలు అనివార్యమవుతాయి. అయితే ఇలాంటి సంక్షోభాలనుంచి భారత మార్కెట్లు అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే వేగంగా కోలుకుంటాయి. సగటున 12-14 నెలల్లో కోలుకుంటాయి. సగటున 16 -18 నెలల్లో గరిష్టాలను తాకుతాయి. భారతీయ మార్కెట్లు ఎంత వేగంగా పడిపోతాయో, అంతే వేగంగా పుంజు కుంటాయని అంచనా. -
ఏ సీమల ఏమైతివో
గెలవలేక పోయినప్పుడు భూమి మీద మనమొక్కరిమే ఏకాకిలా మిగిలి పోయినట్లు అనిపిస్తుంది.. సృష్టి ప్రారంభపు ఏకకణ జీవిలా! చేజారిన గెలుపుతో పాటే అన్నీ మనల్ని వదిలేసి పోయినట్లూ ఉంటుంది. చూసుకోం గానీ, ఒకరు మాత్రం ఆ క్షణంలో మన చెయ్యి పట్టుకునే ఉంటారు. ఓటమి! మరి ఒంటరివాళ్లం ఎలా అవుతాం? ఎగరేస్తున్న గాలిపటం తెగిపోతే హటాత్తుగా ఏకాకులై పోతారు చిన్నపిల్లలు. ఇంట్లో వదిలేసి అమ్మ ఊరెళ్లిపోయినా కూడా.. ‘ఏ సీమల ఏమైతివో.. ఏకాకినీ నా ప్రియా..’ అని కృష్ణశాస్త్రిలా విలపిస్తారు. ఆయన్ది కవిత్వం. వీళ్లవి కన్నీళ్లు. అంతే తేడా. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక చిన్నమ్మాయ్ షఫాలీ వర్మ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. చిన్నమ్మాయే. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడిన అతి చిన్నవయసు అమ్మాయి. పుట్టిన పదహారేళ్ల నలభై రోజులకే పోటీలోకి వచ్చేసింది. ‘షఫాలీని కన్నీళ్లతో చూడలేకపోతున్నా’ అన్నాడు బ్రెట్ లీ. తనకొస్తున్న కన్నీళ్లతో షఫాలీని చూడలేకపోయాడా, కన్నీళ్లతో ఉన్న షఫాలీని చూడలేకపోయాడా! షఫాలీ తనొక్కటే ఏడ్వడం కాదు. క్రీడాదిగ్గజాలకు, ఉద్ధండులకూ ఏడుపులాంటి ఫీలింగ్‌ని తెప్పించింది. ఒకప్పటి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. క్యాచ్ మిస్ అయితే ఎలా ఉంటుందో అతడికి తెలియని బాధ కాదు. క్యాచ్ మిస్ అయిందన్నది టీమ్ పడే బాధ అయితే.. ‘క్యాచ్‌ని మిస్ చేశానే’ అన్నది ఆ క్యాచ్ పట్టలేకపోయిన వారి బాధ. ఫైనల్స్‌లో కీలకమైన అలీసా హీలీ క్యాచ్‌ని మిస్ చేసింది షఫాలీ. అప్పట్నుంచే ఏకాకి అయిపోయింది. తను జారవిడిచింది క్యాచ్‌ని కాదు, కప్పుని. ఆటకు కనికరం ఉండదు. బ్రెట్లీలా ‘ఓ మై షఫాలీ’ అని సానుభూతి పడదు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించి, ఆ వర్షం నీళ్లలో కన్నీళ్లను కనబడనీయకుండా చేయదు. తన పనిలో తను ఉంటుంది. వెంటనే గెలిచినవాళ్ల దగ్గరకు వెళ్లిపోయి మెరుస్తున్న కప్పులో తన ముఖం చూసుకుని జుట్టు సవరించుకుంటుంది.. తన జట్టేదో గెలిచినట్లు, తనే గెలిపించినట్లు! అలాంటిది.. ఓడిపోయిన జట్టులోని షఫాలీ కన్నీళ్లను ఎందుకు పట్టించుకుంటుంది? ‘చిన్న పిల్లవు కదా, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అంటూ ముంగురుల్ని వేళ్లతో అలా అలా అనేసి ఎందుకు వెళుతుంది? ఆశలు పెట్టుకుంది షఫాలీ.. అందుకొచ్చిన ఏడుపు అది. ‘ఆశలు రాలి ధూళిపడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు.. వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశపు రక్త బిందువులతో..’ మేఘసందేశాన్ని రచియించాడు కృష్ణశాస్త్రి. ఈ అమ్మాయి కళ్లు మేఘాలై, ఓటమి వేదనను వర్షించాయి. అనుకుంటాం.. మన ఒంట్లో ఊపిరనేది ఒకటి ఉంటుందని, అందుకని జీవించి ఉంటాం అని. ఊపిరి కాదు ఉండేది. ఆశ. ఆశే ఊపిరికైనా ఆయువు. ఫైనల్స్‌లో తొలి ఓవర్లోనే రెండు పరుగులకే షఫాలీ ఔట్ అయింది! ఆయువు అవిరై కళ్లల్లోకి ఉబికి వచ్చేసింది. పిచ్, టీమ్, మెల్బోర్న్ మైదానం.. ఏవీ కనిపించడం లేదు. అంతా అలికేసినట్లున్న ఒకటే బ్లర్ పిక్చర్. ఓటమి! షఫాలీ మీద హోప్స్ పెట్టుకుంది భారత జట్టు. షఫాలీ ఉందని హోప్స్ వదులుకుంది ఆస్ట్రేలియా జట్టు. కప్పు కోసం పోటీ పడుతున్న రెండు జట్లకూ షెఫాలీ ముఖ్యం. షఫాలీని నిలబెట్టుకోవడం కోసం టీమ్ ఇండియా, షఫాలీని పడగొట్టడం కోసం టీమ్ ఆస్ట్రేలియా. గెలిస్తే ప్రపంచ కప్పులో భారత మహిళల తొలి విజయం. భారత్‌ను ఓడిస్తే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాకు ఐదవ విజయం. అసలు ఫైనల్స్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు టార్గెట్ అయింది షెఫాలీ. ‘ఐ జస్ట్ హేట్ ప్లేయింగ్ ఇండియా.. దే హ్యావ్ గాట్ ద ఉడ్ ఓవర్ మి’ అని అంది మెగాన్ షూట్. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ తను. ‘గాడ్ ద ఉడ్’ అనే మాట పూర్తిగా ఆస్ట్రేలియా వాళ్లది. ‘ఎక్కడం’ అని అర్థం. ట్రై సీరీస్‌లో షఫాలీ తన సిక్సర్‌తో ఆమెను ఎక్కేసిందట. అది గుర్తుంచుకుంది షూట్. బలమైనవాళ్లు కూడా గుర్తుపెట్టుకునేంత షాట్ కొట్టిందన్నమాట షఫాలీ! క్రీడాకారులలో, చిన్నపిల్లల్లో ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. పైగా షఫాలీ క్రీడాకారిణి అయిన చిన్నపిల్ల. ఫైనల్స్‌లో మళ్లీ సిక్సర్లు కొట్టి షూట్ నోటిని ‘ఆ..’ అని తెరిపించాలని కూడా ఆమె అనుకుని ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తన జట్టును గెలిపించాలని తపించి ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తొమ్మిదేళ్ల వయసులో.. అబ్బాయిలు మాత్రమే ఆడే అకాడమీలో తనను చేర్పించడానికి అబ్బాయిలా తనకు క్రాఫ్ చేయించి సీటు సంపాదించిన తండ్రికి.. హర్యానా నుంచి ఆస్ట్రేలియా వచ్చే ముందు.. ‘నాన్నా.. కప్పుతో కనిపిస్తాం, చూస్తుండు’ అని షఫాలీ చెప్పే ఉండొచ్చు. అదీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదూ అంటే ప్రయత్నలోపం కాదని తెలుసుకోడానికి షెఫాలీ మరికొన్ని ఆటలు ఆడాలి. దక్కని గెలుపు మిగిల్చి వెళ్లిన ఒంటరితనాన్ని పోగొట్టి అక్కున చేర్చుకునే మైదానాలు, వాటిలో ఆడవలసిన ఆటలు ఇంకా ఎన్నిలేవు ఈ చిన్నమ్మాయ్కి. -
సోనీ సంచలన నిర్ణయం, యూజర్ల పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సోనీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది సోనీ మొబైల్స్. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నామంటూ సోని జపాన్ ఎలక్ట్రానిక్ మేజర్ సోనీ అనూహ్యంగా ప్రకటించింది. ఇక్కడి మార్కెట్లో నష్టాలు, ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనీ తెలిపింది. 2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించాలని చూస్తోంది. అలాగే 5జీసేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్, యూరప్, హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని, ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపివేశామని, అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ తెలిపింది. భారత స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఉన్న పోటీ మరే ఇతర మార్కెట్లలో లేదంటే అతిశయోక్తికాదు. అయితే భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల హవా భారీగా నడుస్తోంది. వీటి దెబ్బకి శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజాలు కూడా వణుకుతున్న పరిస్థితి. సోనీ లాంటి బ్రాండెడ్ కంపెనీలపై కూడా మరింత ప్రభావం పడుతోంది. ఈ పోటీలో నష్టాల పాలైన సోనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఇక నుంచి భారత్‌లో సోనీ స్మార్ట్ ఫోన్లు వుండవు. సోనీ వినియోగదారుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్న వారికి మాత్రం కంపెనీ తరఫున సేవలు అందిస్తామంటూ దేశీయ సోనీ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. విక్రయాలు ఆపేసినా తమ ఫోన్లు వాడే యూజర్లకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్వేర్ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి సోనీ మొబైల్స్ 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. అదే సమయంలో ఆపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో ఉన్నాయి. -
అది ఔటా.. నాటౌటా?
కొందరు ఉత్సాహంగా గల్లీ క్రికెట్ ఆడటం మొదలెట్టారు. పరిగెత్తుకొచ్చిన బౌలర్ అంతే వేగంగా బ్యాట్స్‌మెన్‌కు బంతిని విసిరాడు. దూసుకొచ్చిన బంతి బ్యాట్స్‌మెన్ బ్యాటుకు అందక వికెట్‌ను గిరాటేసింది. అనూహ్యంగా బెయిల్స్‌ను మాత్రం పడేయలేకపోయింది. ఔటో, నాటౌటో ఆడుతున్న అందరికీ సందేహం. అక్కడున్న (వీధి) అంపైర్‌కు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. వాళ్లు విషయాన్ని తేల్చుకుందామని నిర్ణయాధికారాన్ని నేరుగా ఐసీసీకి ట్వీట్ రూపంలో పంపారు. దుబాయ్: బౌలర్ వేసిన బంతికి వికెట్ పూర్తిగా పడిపోయి, బెయిల్స్ పడకున్నా బ్యాట్స్‌మెన్ ఔటయినట్టేనని తేలింది. పాక్‌కు చెందిన గల్లీ ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐసీసీ తన చట్టం 29.1.1 ప్రకారం బౌలర్ వేసిన బంతి, వికెట్లను పడేసి.. బెయిల్స్‌ను పడేయకున్నా బ్యాటర్ ఔటయినట్టేనని చెప్పింది. మొదట ఈ ప్రశ్నకు జవాబును చెప్పాల్సిందిగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఐసీసీ సవాల్ విసిరింది. కొందరు ఔటనగా, మరికొందరు కాదన్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ తన చట్ట ప్రకారం బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా తేల్చింది. టెన్నిస్ బంతి ఆటగాళ్లు అడిగిన ఈ ప్రశ్న అన్ని ఫార్మాట్లు, ప్రొఫెషనల్ గేమ్‌కూ వర్తిస్తుందని అన్వయించుకోవచ్చు. -
ఆ ఈవెంట్ నుంచి చందా కొచర్ ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 3: వీడియోకాన్ గ్రూప్ రుణవివాదంలో ఇరుక్కున్న, ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌కు మరో పరాభవం ఎదురైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) లేడీస్ ఆర్గనైజేషన్ వార్షిక ఉత్సవాలనుంచి ఆమెను తొలగించారు. ఈవారంలో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ చేతులు మీదుగా చందా కొచర్ సన్మానాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే గత నెలలో ఆమె పేరును ప్రముఖంగా ప్రస్తావించిన నిర్వాహకులు తాజా జాబితాలో చందా కొచర్ పేరును తొలగించడం గమనార్హం. నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 5వ తేదీన జరిగే ఈవెంట్‌కు చందా కొచర్ గౌరవ అతిధిగా హాజరుకావాల్సి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అందించిన సేవలకుగాను చందాకొచ్చర్‌ను ఎఫ్ఎల్వో ఐకాన్ ఆవార్డుతో సత్కరించాలని భావించింది. కానీ ఈ కార్యక్రమంనుంచి ఆమెను తప్పించామని ఎఫ్ఎల్వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రష్మి సతిటా తెలిపారు. అయితే ఎందుకు తొలగించిందీ కచ్చితంగా చెప్పలేదు. 2018 ఏప్రిల్ 5న ఎఫ్ఎల్వో 34వ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో చందాకొచర్ గౌరవ అతిథిగా ఉంటారనీ మార్చి 31న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 10మంది భారతీయ మహిళా ప్రముఖులను ఎఫ్ఎల్వో ఐకాన్ అవార్డులతో సత్కరించనున్నామని చెప్పింది. ఆరోగ్యం, సంక్షేమం రంగంలో ఎయిమ్స్ చీఫ్, ఆర్గాన్ రిట్రీవల్ అండ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆరతి విజ్, వినోద రంగంలో నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా, మీడియా ఎంట్రప్రెన్యూర్షిప్లో బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ డైరక్టర్ ఎక్తాకపూర్, డిజిటల్ వ్యాపారంలో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయక్, సాహిత్యంలో నమితా గోఖలే తదితరుల పేర్లను ఈ జాబితాలో పేర్కొంది. -
మానని గాయం..అందని సాయం..
నగరం దుర్ఘటనకు మూడేళ్లు.. పీడ కలలా వెన్నాడుతున్న గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం నేటికీ అమలు కాని వాగ్దానాలు సాయం కోసం బాధితుల ఎదురుచూపులు అది 2014 జూన్ 27వ తేదీ..సమయం ఉదయం ఆరు గంటలు.. నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఎదురుగా పేలుడు శబ్ధాలతో భారీ విస్ఫోటం..సుమారు 22 మంది మృత్యువాత.. 17 మందికి తీవ్రగాయాలు.. ఒళ్లంతా కాలిన గాయాలతో.. ప్రాణాలు అరచేతపట్టుకుని అంతా పరుగులుదీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఇంకా ‘నగరం’వాసుల కళ్లముందు పీడకలలా వెంటాడుతూనే ఉంది. మూడేళ్ల క్రితం వరకు నిత్యం వినియోగదారులతో కళకళలాడే భోజన హోటళ్లు, ఆ పరిసర ప్రాంతాలు నేటికీ కళావిహీనంగానే కనిపిస్తున్నాయి. పేలుడు అనంతరం పరామర్శలకు వచ్చిన నేతలు, అధికారులు ఎడాపెడా బాధితులకు హామీలిచ్చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మరిచారు. - నగరం (మామిడికుదురు): అమలుకు నోచుకోని హామీలు.. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ చేసిన వాగ్దానాలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా నిర్వహించిన సర్వే నివేదికలను బుట్టదాఖలు చేశారు. ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో పాటు గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నగరంలో కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా దానికీ మోక్షం లేదు. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి పైసా నిధులు కూడా కేటాయించలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు నాటి పేలుడులో మా కుటుంబంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాకు ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షలు పరిహారం ఇచ్చారు. నాకు నాలుగు నెలల 15 రోజులు గెయిల్ ఆధ్వర్యంలోనే చికిత్స జరిగింది. తరువాత నన్ను పట్టించుకోలేదు. తదుపరి ఆరు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. దానికి గాను రూ.7.25 లక్షలు ఖర్చయ్యింది. వాళ్లు ఇచ్చిన ఐదు లక్షలు పోగా అదనంగా మరో రూ.2.25 లక్షలు ఖర్చయ్యింది. ఇళ్లు దెబ్బతిన్నందుకు గాను పరిహారం ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. ఇప్పటికీ గెయిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. - బోనం పెద్దిరాజు, బాధితుడు సహాయం కోసం.. పేలుడు సంఘటనలో నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. రెండు చేతులు సరిగా పని చేయడం లేదు. చేతులకు ఆపరేషన్ చేయిస్తామన్నారు. దానిని పట్టించుకోవడం లేదు. ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంత ఆర్థిక స్థోమత మా కుటుంబానికి లేదు. గెయిల్ వారే ఆ ఖర్చు భరించాల్సి ఉంది. దీంతో పాటు పిల్లలకు చదువు చెప్పిస్తామన్నారు. దీనిపై నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసినా ఫలితం లేదు. - వానరాశి దుర్గాదేవి, బాధితురాలు ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు గెయిల్ పైప్‌లైన్ పేలుడులో నాన్న వానరాశి వెంకటరత్నం మృతి చెందారు. మా కుటుంబానికి ఆయనే ఆధారం. నేను డిగ్రీ చదువుకున్నా. మృతుల కుటుంబాల్లో అర్హులు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆ హామీని నెరవేర్చలేదు. ఎన్నో సార్లు గెయిల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. - వానరాశి నాగసత్యస్వామి ఇళ్లు కట్టిస్తామన్న హామీని విస్మరించారు పేలుడు సంఘటనలో మా కుటుంబంలో ఆరుగురు చనిపోయారు. సొంత స్థలంఉంటే మృతుల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వాధికారులకు, గెయిల్ అధికారులకు ఎన్ని పర్యాయాలు విజ్ఞాపన పత్రాలు అందించినా వారు పట్టించుకోలేదు. పేలుడు జరిగిన సమయంలో మాత్రం పదే పదే మా చుట్టూ తిరిగిన అధికారులు మళ్లీ కంటికి కనిపించనే లేదు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీని మాత్రం విస్మరించారు. - అల్లూరి రామతులసి -
మా గోడు పట్టించుకోండి
రోడ్డున పడ్డ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పదేళ్లుగా పనిచేయించుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఖాళీల భర్తీకి వినతి కొత్తపేట : బాబు వస్తే.. జాబు వస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టాక..బాబు వస్తే జాబు రావడం మాటెలా ఉన్నా ఉన్న జాబులు ఊడిపోవడం ఖాయమనే విధంగా తయారైంది పాలన. ‘బాబుగారి మాటలకు అర్థాలే వేరులే అన్నది అక్షరాలా సత్యమని రుజువు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్కొక్క శాఖలో ఉద్యోగాలు ఊడ పీకేస్తూ వారి పొట్ట కొడుతూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 800 మంది ఆరోగ్య మిత్రలను ఈ ప్రభుత్వం తొలగించగా వారు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో స్టే ఆర్డర్ ద్వారా కొనసాగుతున్నారు. తాజాగా అదే శాఖ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇటీవల జనరల్ ట్రాన్స్ఫర్స్ కారణంగా జిల్లాలో 5 ఆస్పత్రుల్లో పని చేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. వారిలో 9 మంది కొత్తపేట సీహెచ్‌సీ సిబ్బందే ఉన్నారు. వారిలో స్టాఫ్ నర్సులు ఐదుగురు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డ్రైవర్ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అలాగే పెద్ధాపురం సీహెచ్‌సీ నుంచి ముగ్గురు, అమలాపురం, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రులు, అనపర్తి సీహెచ్‌సీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలు కోల్పోయారు. జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌తో రాజమహేంద్రవరం, అమలాపురం, తణుకు ఆస్పత్రుల్లో రెగ్యులర్ సిబ్బంది, పైఆస్పత్రులను కోరుకోవడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగిస్తూ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సుమారు పదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయి. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీల్లో ఈ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకుండా పొట్టకొట్టింది. ఆ బాధితులు ఉద్యోగ సంఘాల ద్వారా ఈ నెల 14 న వైద్య విధాన పరిషత్ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్ కిషోర్‌ను కలిసి తమను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎక్కడో చోట ఉద్యోగం ఇప్పించి ఉపాది కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధి కల్పించాలని వారు కోరారు. షెడ్డుకు చేరిన అంబులెన్సు... ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన డ్రైవర్ చేతిలో పని చేసిన అంబులెన్స్ రెగ్యులర్ డ్రైవర్ వచ్చాక రిపేర్ల పేరుతో షెడ్డుకు చేరింది. కొత్తపేట ఆస్పత్రికి ఉన్న అంబులెన్స్ పాతదైనా సేవలందిస్తుంది. ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌తో ఈ నెల 5న కూడా అత్యవసర పరిస్థితిలో పేషెంటును రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 6న వచ్చిన రెగ్యులర్ డ్రైవర్‌కు అది పనిచేయలేదు. రిపేర్లు చేయించాలని అమలాపురం షెడ్డుకు చేర్చారు. ఎప్పటి నుంచో ఇక్కడ మరో అంబులెన్సు ఆవశ్యకత ఉంది. ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు రెగ్యులర్ డ్రైవర్ రాకతో ఉన్న అంబులెన్సు కూడా షెడ్డుకు చేరి, అసలు అంబులెన్సే లేకుండా పోయిందని పలువురు స్థానికులు వాపోయారు. మళ్లీ ఉద్యోగాలు ఇప్పించండి సుమారు పదేళ్లుగా ఈ ఉద్యోగాలను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. మరే పనీ చేసుకోలేని తమకు మళ్లీ తమ ఉద్యోగాలు ఇప్పించి ఆదుకోవాలి. జిల్లాలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెళ్లి పనిచేసుకుంటాం. ఉపాధి కల్పించండి. - ధర్నాల బూరిబాబు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, కొత్తపేట న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా ఔట్ సోర్సింగ్ పోస్టులన్నీ ఖాళీలుగా చూపించడం వల్ల రెగ్యులర్ స్టాఫ్‌తో భర్తీ చేయాల్సి వచ్చింది. ఉపాధి కోల్పోయిన సిబ్బందికి మళ్లీ పోస్టింగ్‌ల కోసం కమిషనర్‌కు లేఖ పంపించాం. అక్కడ పరిశీలనలో ఉంది. ఖాళీల్లో వారికి అవకాశం కల్పించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. - రమేష్‌కిషోర్, డీసీహెచ్ఎస్, రాజమహేంద్రవరం -
నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
తూర్పుపాలెంలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కానరాని జాగ్రత్త మలికిపురం (రాజోలు) : సమయం : బుధవారం ఉదయం 11 గంటలు స్థలం : తూర్పుపాలెం గ్రామం, కే డబ్ల్యూ 17 జడ్ ఓఎన్జీసీ సైట్ .. ఉన్నట్టుండి డ్రిల్లింగ్ జరిగిన బావి నుంచి అకస్మాత్తుగా భారీ గ్యాస్, ఆయిల్ పెల్లుబికింది. గ్యాస్ కిలో మీటరు మేర ఆవరించింది. సిబ్బంది, ఇంజినీర్లు కూడా తొలుత పరుగులు పెట్టారు.సమీపంలోని జీసీఎస్ ( గ్యాస్ గేదరింగ్ స్టేషన్)ల నుంచి సుమారు 200 మంది సిబ్బంది, నాలుగు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అరగంట గడిచాక గ్యాస్ తొలగింది. కాసేపు తేరుకున్న సిబ్బంది, కంటికి సంఘటన స్థలం కనిపిస్తుండడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటన బావి వద్దకు చేరుకున్నారు. ఒక ఓఎన్జీసీ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇక్కడ అత్యంత భయంకర వాతావరణం నెలకొంది. ఆయిల్, గ్యాస్ ఆవరించి ఉంది. ఇక్కడే మరో మూడు గ్యాస్ ఆయిల్, బావులు ఉన్నాయి. ఫొటోలు తీస్తే ఆ ఫ్లాష్ తీవ్రతకు ఫైర్ అయితే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానిక విలేకరులను, గ్రామస్తులను హెచ్చరించారు. ప్రమాద తీవ్రత ఏంటో చెప్పకనే అర్థమవుతోంది. దీనికి కారణం ఎవరు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలదా? భద్రత లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ సంస్థలదా? ఇలాంటి అనేక సంఘటనలు ప్రాణాలను హరించి వేస్తున్నాయి. 1990 ప్రాంతంలో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లోఅవుట్, 1995లో కొత్త పేట మండలం దేవర పల్లి బ్లోఅవుట్, 2014లో నగరం పైప్ లైన్ పేలుడు, సహా అనేక సంఘటనలు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. మూడే ళ్ల క్రితం రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండేళ్ల క్రితం రాజోలు మండలంలో కాట్రేని పాడు బావి బ్లోఅవుట్ కొద్దిపాటిలో తప్పింది. కేజీ బేసిన్లోఉమారు 11 వందల బావులు, మొత్తం 900 కిలో మీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. బావులు కోనసీమలోనే అధికం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకూ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం బావులను, గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ కేజీ బేసిన్లో ఈ బావుల, పైప్లైన్ల నిర్వహణ సక్రమంగాలేదు. అంతా నిర్లక్ష్యం .. బావులు, గ్యాస్ పైప్‌లను తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడయి పోతున్నా వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు పెట్టుబడి పెట్టడం లేదు. నాణ్యత లోపం .. ఆయిల్ బావుల పర్యవేక్షణ, పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వీటి నిర్వహణ, నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రేవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లను కూడా ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సమద్రం నుంచి ఉప్పు నీరు భూబాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
భారత్‌తో టెస్టు సిరీస్‌కు గాయంతో సౌతీ దూరం
న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ గాయం కారణంగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ట్రైనింగ్ సందర్భంగా అతని ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో తను స్వదేశానికి వెళుతున్నాడు. సౌతీ స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి రానున్నాడు. అరుుతే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు సౌతీ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ భావిస్తోంది. -
విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'
రష్యాః సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, తీర ప్రాంతాలకు వెడుతుంటారు. అవకాశం లేనివారు కొందరు.. బాల్కనీల్లోనూ, అపార్ట్ మెంట్లు, భవనాల టెర్రస్ లను సన్ బాత్ కు వినియోగించుకుంటారు. అయితే అసలు బయటకు వెళ్ళే పనే లేదంటోంది ఓ రష్యన్ మహిళ. బికిని ధరించి, ప్రతిరోజూ కిటికీ నుంచీ వచ్చే ఎండనే సన్ బాత్ కు వినియోగించుకుంటూ చుట్టుపక్కల వారిని విస్మయపరుస్తోంది. రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాపట్టణం నోవోసిబిర్స్క్ క్రోపోట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీనుంచీ ప్రతిరోజూ కనిపించే సన్ బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివసించే మహిళ.. బికినీ ధరించి, తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తూ చూపరులను అకట్టుకోవడమేకాదు.. ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, పార్క్ లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో అందరికీ తెలిసేట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు అక్కడి వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే కొందరు కాలనీవాసులు మాత్రం ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అక్కడే చిన్న పిలలు అడుకుంటుంటారని, సదరు మహిళ ఎక్స్ పోజింగ్ ను తట్టుకోలేకపోతున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆమె విండో సన్ బాత్ ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్ ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్ కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు సన్ బాతర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంత సమయం విండో సన్ బాత్ చేస్తూనే ఉంది. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఆమె ఇలా కాళ్ళు, నడుమువరకూ బయటకు పెట్టి ఎక్స్ పోజ్ చేయడం మొదటిసారి కాదని, బాడీ మొత్తం సమాంతరంగా ట్యాన్ అయ్యేందుకు, శరీర పై భాగాన్ని కూడ ఎండలో బయటకు పెట్టేదని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు పూర్తి శాతం బికినీతో ఉండేదని మరి కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు అంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ సన్ బాత్ సుందరి మాత్రం.. తన రోజువారీ కార్యక్రమాన్ని ఆపేట్టు కనిపించడం లేదు. -
విడిపోదాం.. కాదు కలిసుందాం!
ఒక కుటుంబం గానీ, రాష్ట్రం గానీ, ఒక దేశం గానీ విడిపోవాలంటే అది చాలా బాధాకరమైన నిర్ణయం అవుతుంది. కొంతమంది కలిసుందాం అంటే, మరికొందరు విడిపోదాం అంటారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఓ నిర్ణయం తీసుకుంది. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. 3.35 కోట్ల మంది బ్రిటన్ పౌరులు ఓటింగులో పాల్గొన్నారు. వాళ్లలో ఈయూ నుంచి బయటకు వచ్చేద్దామని 1,74,10,742 మంది అభిప్రాయపడితే, కలిసుందామని 1,61,41,241 మంది అన్నారు. దాంతో 51.9 శాతం ఓట్లతో విడిపోవాలన్న తుది నిర్ణయానికి వచ్చారు. కలిసుందామని చెప్పినవాళ్లు 48.1 శాతం మంది మాత్రమే ఉన్నారు. మొత్తం నాలుగు దేశాల సమాహారమైన బ్రిటన్ లో ఓ దేశం కచ్చితంగా కలిసుండాలని ఓటేస్తే.. మరో దేశం అందుకు విరుద్ధంగా తీర్పును ఇచ్చింది. ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ల్లో ఇంగ్లండ్, వేల్స్ ల్లోని ప్రజల్లో ఎక్కువ మంది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలని ఓటింగ్ ద్వారా తెలిపారు. కాగా, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్ ల్లో అత్యధిక జనాభా యూరోపియన్ యూనియన్ లో భాగస్వామ్యులగానే ఉండాలంటూ ఓట్ చేయడం విశేషం. ఓటింగ్ సరళి.. ఇంగ్లండ్ లో 15,188,406 మంది ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలంటూ ఓట్ చేయగా.. ఈయూలోనే ఉండాలంటూ 13,266,996 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. స్కాట్లాండ్ లో 1,018,322 మంది ప్రజలు యూనియన్ నుంచి విడిపోవాలని ఓట్ చేయగా, 1,661,191 మంది పౌరులు యూనియన్ తో పాటే కొనసాగాలని తీర్పునిచ్చారు. ఉత్తర ఐర్లాండ్ లో 3,49,442 మంది ప్రజలు విడిపోవాలని ఓట్లు వేయగా, 440,437 మంది కలిసుందామని ఓటు వేశారు. వేల్స్ లో 854,572 మంది యూనియన్ నుంచి విడిపోవాలని తేల్చి చెప్పగా, 772,347 మంది కలిసి నడవాలని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఇంగ్లండ్ లో ఎక్కువ శాతం మంది విడిపోవడానికే మొగ్గుచూపారు. దాదాపు 53.4 శాతం మంది విడిపోవాలని ఓటు వేశారు. వేల్స్ నుంచి కూడా ఇదే తరహాలో 52.5 శాతం మంది విడిపోదామని గొంతుక కలపడంతో తక్కువ జనాభా కలిగిన స్కాట్లాండ్ నుంచి అత్యధికంగా 62శాతం మంది, ఉత్తర ఐర్లాండ్ నుంచి 55.8శాతం మంది కలిసుందామన్న ఉపయోగం లేకుండా పోయింది. ఉత్తర ఇంగ్లండ్ లో ఎక్కువ మంది ప్రజలు విడిపోవడానివే మొగ్గు చూపారు. నార్తంబర్లాండ్, ఈడెన్, దుర్హామ్, రిచ్ మండ్ షైర్, అల్లేర్డేల్, హంబ్లేటన్ రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతంలో ప్రజలు విడిపోవాలంటూ తీర్పు చెప్పారు. దక్షిణ ఇంగ్లండ్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో కలిసుండాలంటూ గట్టిగా గొంతు వినిపించినా మిగిలిన రాష్ట్రాల తీర్పుతో ఆ గొంతు శబ్దం బయటకు వినిపించలేదు. ప్రధానంగా విల్ట్ షైర్, సోమర్ సెట్, కార్న్ వాల్, సౌత్ హంప్ షైర్ తదితర రాష్ట్రాల్లో విడిపోవాలని చెప్పారు. కాగా, లండన్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కలిసుండాలనే గొంతుక ఎక్కువగా వినిపించింది. వెస్ట్ ఆక్స్ ఫర్డ్ షైర్, వేల్ ఆఫ్ వైట్ హార్స్, వెస్ట్ బెర్క్ షైర్ లలోని ప్రజలు కలిసే ఉందామని అన్నారు. తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో కలిసుందామనే గొంతుక పెద్దగా వినిపించలేదు. ఈస్ట్ లిండ్సీ, ఈస్ట్ రైడింగ్ ఆప్ హంప్ షైర్, కింగ్స్ లిన్ అండ్ వెస్ట్ నార్ ఫ్లోక్, బ్రెక్ ల్యాండ్, ఈస్ట్ కేంబ్రిడ్జ్, ఈస్ట్ నార్తాంప్టన్ షైర్, హెరే ఫోర్డ్ షైర్, ష్రాప్ షైర్, చెషైర్ వెస్ట్ అండ్ చెస్టర్, ఫారెస్ట్ ఆఫ్ డీన్ తదితర రాష్ట్రాల్లో విడిపోవడానికి మొగ్గు చూపాయి. మొత్తం 20 రాష్ట్రాలున్న వేల్స్ లో దాదాపు 15 రాష్ట్రాలు విడిపోవడానికి ఇష్టపడ్డాయి. అతి పెద్ద రాష్ట్రమైన పోవైస్ కూడా విడిపోవాలని తీర్పు చెప్పింది. స్కాట్లాండ్ లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా కలిసుండాలనే ఓట్లు వేశారు. అతిపెద్ద రాష్ట్రాలైన హైలాండ్, అబెర్డీన్ షైర్, పెర్త్ అండ్ కిన్రోస్, అర్గిల్ అండ్ బుటే, డుమ్ ప్రైస్ అండ్ గాల్లోవే, స్కాటిష్ బోర్డర్లు వీటిలో ఉన్నాయి. ఉత్తర ఐర్లాండ్ లోని ఎనిమిది రాష్ట్రాల ప్రజలు విడిపోవాలని ఓటింగ్ చేశారు. కాగా, పెద్ద రాష్ట్రాలైన వెస్ట్ టైరోన్, ఫెర్మనాగ్ అండ్ సౌత్ టైరోన్, మిడ్ ఉల్స్టర్, ఈస్ట్ లండన్ డెర్రీ, సౌత్ డౌన్ లలోని ప్రజలు మాత్రం కలిసుండాలని ఓట్లు వేశారు. ఇక లాంఛనమే.. ఇక యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడం లాంఛనమే. అయితే, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్నట్లు బ్రిటన్ ముందుగా యూరోపియన్ కౌన్సిల్ కు తెలియజేయాల్సి వుంటుంది. ఇరువర్గాలు ఈ విషయంపై చర్చించి అంగీకారం తెలిపిన తర్వాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల గడువు ఉంటుంది. ఈ లోపు బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వస్తుంది. -
'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ
లండన్ః స్కిన్ క్యాన్సర్ నివారణకు డ్రగ్ కాక్టెయిల్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిసోధనలు చెప్తున్నాయి. రెండు వ్యాధి నిరోధక మందులు కలపడంతో రోగుల జీవిత కాలాన్నిమరింత పొడిగించవచ్చని, అన్ని రకాల మెలనోమాను నాశనం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మ క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించినా నివారించవచ్చని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. స్మార్ట్ ఔషధాల కలయిక చర్మ క్యాన్సర్ ను నివారిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండు ఔషధాలను కాక్టెయిల్ చేసి రోగుల్లోని అన్ని రకాల మెలనోమాను నివారించ గలిగినట్లు అధ్యయనకారుల పరిశోధనా ఫల్లితాలు వెల్లడించాయి. ఒకవేళ క్యాన్సర్ శరీరంలోని ఇదర భాగాలకు వ్యాపించినప్పటికీ ఈ కొత్త పద్ధతితో తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. 2013 లో బ్రిటన్ లోని 14,500 మందిలో మెలనోమా వ్యాపించగా అందులో 2,100 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. తాజాగా కనుగొన్న ఈ కాక్టెయిల్ పద్ధతిలో వైద్యులు సింగిల్ గానూ రెండు మందులను కలపి మెలనోమా ఉన్న 142 మంది రోగులకు అందించారు. కొత్త ప్రయోగంతో 69 శాతం రోగుల్లో మంచి ఫలితాలు కనిపించాయని, ఒకటే మందును ఇచ్చిన 53 శాతంమంది రోగులకన్నా... రెండు మందులను కలిపి ఇచ్చిన రోగులు మరో రెండు సంవత్సరాలు తర్వాత కూడ బతికే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కాక్టెయిల్ మందు తీసుకున్న 22 శాతంమందిలో క్యాన్సర్ పుండును పూర్తిగా నిర్మూలించినట్లు గుర్తించారు. దీంతో ఇపిలిముమాబ్ (కాక్టెయిల్ డ్రగ్) మంచి ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్నారు. రెండు ఔషధాల కలయిక క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తుందని, రోగంతో సమర్థవంతంగా పోరాడుతుందని లారిన్ మర్శేన్ ఆస్పత్రి సలహాదారుడు డాక్టర్ జేమ్స్ లార్కిన్ తెలిపారు. ఈ కొత్త పరిశోధనలు రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత ఆశను కల్పించాయని తెలిపారు. పరిశోధనా ఫలితాలను ఆమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్స్ వార్షిక సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ రెండు ఔషధాల కలయికను బ్రిటన్ లో ప్రయోగించేందుకు ఇంకా ఆమోదించలేదు. ఈ కొత్త పద్ధతిలో వైద్యం కొంత ఖరీదు అవుతుందని, అయితే మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ పద్ధతిని అనుమతిస్తే... ఖరీదు విషయం తర్వాత ఆలోచించవచ్చని బ్రిటన్ క్యాన్సర్ రీసెర్స్ లోని డాక్టర్ ఆనె మెక్ కార్తీ అంటున్నారు. మరోవైపు తాను ఇంతకు ముందు ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నానని, ఇప్పుడు మరో రెండేళ్ళు బతికే ఉన్నానంటే ఈ కొత్త పరిశోధనల ఫలితమేనని కాక్టెయిల్ డ్రగ్ ను వినియోగించిన రోగి కూడ చెప్తున్నారు. -
వరల్డ్ కప్ నుంచి మలింగ ఔట్
ముంబై: టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మోకాలి గాయంతో జట్టకు దూరమయ్యాడు. గురువారం అప్ఘనిస్తాన్తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో దిల్షాన్ గాయపడ్డాడని జట్టు మేనేజర్ వెల్లడించారు. దీంతో ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో మలింగ లేకుండానే శ్రీలంక బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు టోర్నీ మొత్తానికి మలింగ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు స్పోక్స్ పర్సన్ శుక్రవారం వెల్లడించారు. మలింగ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 155 పరుగులు చేసిన విషయం తెలిసిందే.