వరల్డ్ కప్ నుంచి మలింగ ఔట్
ముంబై: టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మోకాలి గాయంతో జట్టకు దూరమయ్యాడు. గురువారం అప్ఘనిస్తాన్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్లో దిల్షాన్ గాయపడ్డాడని జట్టు మేనేజర్ వెల్లడించారు. దీంతో ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మలింగ లేకుండానే శ్రీలంక బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు టోర్నీ మొత్తానికి మలింగ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు స్పోక్స్ పర్సన్ శుక్రవారం వెల్లడించారు. మలింగ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 155 పరుగులు చేసిన విషయం తెలిసిందే.