'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ | Drug Cocktail Can Wipe Out Skin Cancer | Sakshi
Sakshi News home page

'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ

Published Tue, Apr 19 2016 5:08 PM | Last Updated on Fri, May 25 2018 2:57 PM

'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ - Sakshi

'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ

లండన్ః స్కిన్ క్యాన్సర్  నివారణకు డ్రగ్ కాక్టెయిల్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిసోధనలు చెప్తున్నాయి. రెండు వ్యాధి నిరోధక మందులు కలపడంతో రోగుల జీవిత కాలాన్నిమరింత పొడిగించవచ్చని, అన్ని రకాల మెలనోమాను నాశనం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మ క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించినా నివారించవచ్చని తాజా పరిశోధనలు చెప్తున్నాయి.

స్మార్ట్ ఔషధాల కలయిక చర్మ క్యాన్సర్ ను నివారిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండు ఔషధాలను కాక్టెయిల్ చేసి రోగుల్లోని అన్ని రకాల మెలనోమాను నివారించ గలిగినట్లు అధ్యయనకారుల పరిశోధనా ఫల్లితాలు వెల్లడించాయి. ఒకవేళ క్యాన్సర్ శరీరంలోని ఇదర భాగాలకు వ్యాపించినప్పటికీ ఈ కొత్త పద్ధతితో తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. 2013 లో బ్రిటన్ లోని 14,500 మందిలో మెలనోమా వ్యాపించగా అందులో 2,100 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. తాజాగా కనుగొన్న ఈ కాక్టెయిల్ పద్ధతిలో వైద్యులు సింగిల్ గానూ రెండు మందులను కలపి మెలనోమా ఉన్న 142 మంది రోగులకు అందించారు. కొత్త ప్రయోగంతో 69 శాతం రోగుల్లో మంచి ఫలితాలు కనిపించాయని, ఒకటే మందును ఇచ్చిన 53 శాతంమంది రోగులకన్నా... రెండు మందులను కలిపి ఇచ్చిన రోగులు మరో రెండు సంవత్సరాలు తర్వాత కూడ  బతికే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కాక్టెయిల్ మందు తీసుకున్న  22 శాతంమందిలో క్యాన్సర్  పుండును పూర్తిగా నిర్మూలించినట్లు గుర్తించారు. దీంతో ఇపిలిముమాబ్ (కాక్టెయిల్ డ్రగ్)  మంచి ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్నారు.

రెండు ఔషధాల కలయిక క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తుందని, రోగంతో సమర్థవంతంగా పోరాడుతుందని  లారిన్ మర్శేన్ ఆస్పత్రి సలహాదారుడు డాక్టర్ జేమ్స్ లార్కిన్ తెలిపారు. ఈ కొత్త పరిశోధనలు రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత ఆశను కల్పించాయని తెలిపారు. పరిశోధనా ఫలితాలను ఆమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్స్ వార్షిక సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ రెండు ఔషధాల కలయికను బ్రిటన్ లో ప్రయోగించేందుకు ఇంకా ఆమోదించలేదు. ఈ కొత్త పద్ధతిలో  వైద్యం కొంత ఖరీదు అవుతుందని, అయితే మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ పద్ధతిని అనుమతిస్తే... ఖరీదు విషయం తర్వాత ఆలోచించవచ్చని బ్రిటన్ క్యాన్సర్ రీసెర్స్ లోని డాక్టర్ ఆనె మెక్ కార్తీ అంటున్నారు. మరోవైపు తాను ఇంతకు ముందు ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నానని, ఇప్పుడు  మరో రెండేళ్ళు బతికే ఉన్నానంటే ఈ కొత్త పరిశోధనల ఫలితమేనని  కాక్టెయిల్ డ్రగ్ ను వినియోగించిన రోగి కూడ చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement