పాక్ క్రికెట్ అభిమానులు పంపిన ఫొటోను షేర్ చేసిన ఐసీసీ
కొందరు ఉత్సాహంగా గల్లీ క్రికెట్ ఆడటం మొదలెట్టారు. పరిగెత్తుకొచ్చిన బౌలర్ అంతే వేగంగా బ్యాట్స్‌మెన్‌కు బంతిని విసిరాడు. దూసుకొచ్చిన బంతి బ్యాట్స్‌మెన్ బ్యాటుకు అందక వికెట్‌ను గిరాటేసింది. అనూహ్యంగా బెయిల్స్‌ను మాత్రం పడేయలేకపోయింది. ఔటో, నాటౌటో ఆడుతున్న అందరికీ సందేహం. అక్కడున్న (వీధి) అంపైర్‌కు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. వాళ్లు విషయాన్ని తేల్చుకుందామని నిర్ణయాధికారాన్ని నేరుగా ఐసీసీకి ట్వీట్ రూపంలో పంపారు.
దుబాయ్: బౌలర్ వేసిన బంతికి వికెట్ పూర్తిగా పడిపోయి, బెయిల్స్ పడకున్నా బ్యాట్స్‌మెన్ ఔటయినట్టేనని తేలింది. పాక్‌కు చెందిన గల్లీ ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐసీసీ తన చట్టం 29.1.1 ప్రకారం బౌలర్ వేసిన బంతి, వికెట్లను పడేసి.. బెయిల్స్‌ను పడేయకున్నా బ్యాటర్ ఔటయినట్టేనని చెప్పింది. మొదట ఈ ప్రశ్నకు జవాబును చెప్పాల్సిందిగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఐసీసీ సవాల్ విసిరింది.
కొందరు ఔటనగా, మరికొందరు కాదన్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ తన చట్ట ప్రకారం బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా తేల్చింది. టెన్నిస్ బంతి ఆటగాళ్లు అడిగిన ఈ ప్రశ్న అన్ని ఫార్మాట్‌లు, ప్రొఫెషనల్ గేమ్‌కూ వర్తిస్తుందని అన్వయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment