
భువనేశ్వర్ కుమార్
దుబాయ్: ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. పాక్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాట్స్‌మన్లలో బాబర్ ఆజమ్ 47(62 బంతులు), షోయబ్ మాలిక్43(67 బంతులు)లు రాణించారు. కేదార్ జాదవ్, భువనేశ్వర్‌లు చెరో మూడు వికెట్లు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఎలాంటి తడబాటుకు గురికాకుండా టార్గెట్‌ను 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్ శర్మ52(39 బంతులు), ధావన్46(54 బంతులు), రాయుడు31 నాటౌట్(46 బంతులు), కార్తీక్31 నాటౌట్(37 బంతులు) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment