
దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మన్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు సెంచరీలతో కదంతొక్కి తియ్యటి విజయాన్ని అందించారు. పాక్ విసిరిన 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి భారత్ చేధించింది. శిఖర్ ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ కాగా.. రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పాక్ బ్యాట్స్‌మన్లలో షోయబ్ మాలిక్ 78, సర్ఫరాజ్ అహ్మద్ 44, ఆసిఫ్ అలీ 30, ఫఖర్ జమాన్ 31 మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేయగలిగారు. భారత్ బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వేగంగా పరుగులు చేసిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment