Asked
-
నాడు పాక్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
ఢిల్లీ: పాక్ అనుకూల నినాదాలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటీషనర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్‌ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సర్వోన్నత న్యాయస్థానం చర్యలకు పూనుకుంది. "జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, విధేయత చూపుతానని అక్బర్ లోన్ బేషరతుగా అంగీకరిస్తున్నాడని మేము కోరుకుంటున్నాము" అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నానని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. నాయకుల మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంటూ.. క్షమాపణలు కోరకపోతే ఇలాంటి చర్యలను ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడుతున్న కేంద్రం చర్యలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర హోదా మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్‌గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
తాజ్‌మహల్‌ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్ గైడ్‌గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
అది ఔటా.. నాటౌటా?
కొందరు ఉత్సాహంగా గల్లీ క్రికెట్ ఆడటం మొదలెట్టారు. పరిగెత్తుకొచ్చిన బౌలర్ అంతే వేగంగా బ్యాట్స్‌మెన్‌కు బంతిని విసిరాడు. దూసుకొచ్చిన బంతి బ్యాట్స్‌మెన్ బ్యాటుకు అందక వికెట్‌ను గిరాటేసింది. అనూహ్యంగా బెయిల్స్‌ను మాత్రం పడేయలేకపోయింది. ఔటో, నాటౌటో ఆడుతున్న అందరికీ సందేహం. అక్కడున్న (వీధి) అంపైర్‌కు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. వాళ్లు విషయాన్ని తేల్చుకుందామని నిర్ణయాధికారాన్ని నేరుగా ఐసీసీకి ట్వీట్ రూపంలో పంపారు. దుబాయ్: బౌలర్ వేసిన బంతికి వికెట్ పూర్తిగా పడిపోయి, బెయిల్స్ పడకున్నా బ్యాట్స్‌మెన్ ఔటయినట్టేనని తేలింది. పాక్‌కు చెందిన గల్లీ ఆటగాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐసీసీ తన చట్టం 29.1.1 ప్రకారం బౌలర్ వేసిన బంతి, వికెట్లను పడేసి.. బెయిల్స్‌ను పడేయకున్నా బ్యాటర్ ఔటయినట్టేనని చెప్పింది. మొదట ఈ ప్రశ్నకు జవాబును చెప్పాల్సిందిగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఐసీసీ సవాల్ విసిరింది. కొందరు ఔటనగా, మరికొందరు కాదన్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ తన చట్ట ప్రకారం బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా తేల్చింది. టెన్నిస్ బంతి ఆటగాళ్లు అడిగిన ఈ ప్రశ్న అన్ని ఫార్మాట్లు, ప్రొఫెషనల్ గేమ్‌కూ వర్తిస్తుందని అన్వయించుకోవచ్చు. -
బ్లాక్‌మనీ యుద్ధం..జ్యువెలర్స్‌కు షాక్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ నల్లధనం కుబేరులగుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్ళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నవంబరు 8 రాత్రి 8 గం.టల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెల్లరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ (నవంబరు 8) ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మూరుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే వున్నాయనీ, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోళ్లు జరిగాయన్నవార్తలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు. లేదా ఒకే కుటుంబంలోని పలువురు.. వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీబీడీటీ ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్ బాగ్, దారిబా కలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా మూడు ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోలకతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలందాయని స్పష్టం చేశారు. కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం పది గ్రా. పుత్తడి ధర రూ..35 వేల నుంచి మొదలై రూ.49 వేల దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి రూ.40 వేల దగ్గర ప్రారంభమై సుమారు 55 వేల రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారు కొనుగోళ్లపై కచ్చితంగా ప్యాన్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
మోదీకి సంచలన సూచన, అధికారికి నోటీసులు
రాట్లం: సూసైడ్ స్కీమ్స్ పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివాదాస్పద సూచన చేసిన ఓ ప్రభుత్వ అధికారిణి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాట్లం జిల్లా రావోటి మండల తహశీల్దార్ అమితా సింగ్ తన ఫేస్ బుక్ పేజీలో 'సూసైడ్ స్కీం' పెట్టాలని ప్రధానిని కోరుతూ మంగళవారం ఓ పోస్ట్ చేశారు. దానిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అమితా సింగ్ కు జిల్లా ఇన్-చార్జ్ కలెక్టర్ హర్జీందర్ సింగ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా ప్రధానమంత్రి ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ముస్లింలు భారత జాతీయ జెండా చూపుతూ వందేమాతరం, భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారని అనితా సింగ్ తన పోస్టులో రాసుకున్నారు. దయచేసి ప్రధానమంత్రి 'రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన' పథకాన్ని ప్రారంభించాలని ఆమె కోరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద మాయగాళ్లు అయిన లౌకికవాదులకు ఈ స్కీంను ప్రారంభించాలన్నారు. ప్రధాని ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో అక్కడి ముస్లింలు ఆయనను ఆప్యాయంగా స్వాగతించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. అయితే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని అనితా సింగ్ డిలీట్ చేశారు. కాగా ఆ పోస్టు తనకు వాట్సాప్ ద్వారా అందిందని వెంటనే ఫేస్ బుక్ లో పోస్టు చేసినట్లు ఆమె తెలిపారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టును పెట్టలేదని ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని క్షమాపణలు కోరారు. -
భారత విద్యార్ధులకు అమెరికా వర్సిటీ షాక్
వాషింగ్టన్: అమెరికాలో చదువుకోసం వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోగ్రామింగ్ లో సరైన పట్టులేకపోవడంతో యూఎస్ లోని వెస్టర్న్ కెంటకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ చేయడానికి వెళ్లిన 25 మంది విద్యార్థులను వెనక్కు వెళ్లిపోవాలని లేదా వేరే ఏదైనా ఇన్ స్టిట్యూట్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నించుకోవాలని వర్సిటీ కోరింది. ఈ ఏడాది జనవరిలో 60 విద్యార్థులు కోర్సులో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది కనీస ప్రమాణాలు అందుకోలేకపోయారని యూనివర్సిటీ చైర్మన్ జేమ్స్ గ్యారీ తెలిపారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయాలను సూచించిన వాటిలో కూడా విఫలం కావడంతో వారిని వెనక్కు పంపడం తప్ప మరో దారి కనిపించలేదని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధికి ఉండాల్సిన కనీస ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా వాళ్లకు లేవని ఇది తన డిపార్ట్ మెంట్ ను ఇబ్బందికి గురిచేసినట్లు వివరించారు. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్లంతా అంతర్జాతీయ రిక్రూటర్ల ద్వారా స్పాట్ అడ్మిషన్ల ద్వారా తీసుకున్నవేనని చెప్పారు. ఇక నుంచి విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే ముందు యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ భారత్ కు వెళ్లి విద్యార్ధుల అకడమిక్ రికార్డులను పరిశీలించిన తర్వాతే ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కెంటకీ యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్ అసోషియేషన్ చైర్మన్ ఆదిత్య శర్మ విద్యార్ధులను యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమనడం బాధకరమైన విషయం అని అన్నారు. గ్రాడ్యుయేషన్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) లేని విద్యార్ధులు డబ్బులు పోసి సీట్లు కొనుక్కున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పర్యటన కోసం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. -
టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఇంటికి వెళ్లమంటూ వికృతంగా ప్రవర్తించడంతో.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమచారం ప్రకారం డిసెంబర్ 29న తెండా నబాపరా గ్రామానికి చెందిన బాలిక (15) స్నేహితులతో కలిసి సమీప గ్రామంలోని సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా వారిని ఐదుగురు వ్యక్తులు వెంబడించారు. ఆమె స్నేహితులను కొట్టి, అమ్మాయిని అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడితో వారి ఆగడాలు ఆగలేదు. నగ్నంగానే ఇంటికి వెళ్లాలని అనాగరికంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులు, ఇతర వస్తువులను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేని బాలిక సంఘటనా స్థలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు టీనేజర్లు, ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
విద్యార్థినిలపై ఖాకీల దాష్టీకం
జైపూర్: విద్యా బుద్ధులు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలని అడిగిన పాపానికి పదవ తరగతి విద్యార్థినిలపై ఖాకీలు దాష్టీకాన్ని ప్రదర్శించారు. వీధి రౌడీల్లా బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. రాజస్థాన్ లోని మారు మూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 14 , 16 ఏళ్ల బాలికలపై స్థానిక పోలీసులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. టాంక్ జిల్లా చురు గ్రామంలోని సెంకండరీ స్కూల్లో 10వ తరగతి చదువుకునే సుమారు 300 మంది విద్యార్థులకు గాను కేవలం ఏడుగురే ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో రానున్న పబ్లిక్ పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలనే ఆవేదనతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. టీచర్లను నియమించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సెప్టెంబర్ 29న దాదాపు వందమంది విద్యార్థినులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు విచక్షణారహితంగా ఆందోళన చేస్తున్న బాలికలపై విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ బూటు కాళ్లతో తొక్కారు. లాఠీచార్జి చేసి విద్యార్థినిలను లాగి పడేశారు. అంతటితో ఖాకీల ప్రకోపం చల్లారలేదు. సారా ప్యాకెట్లను అమ్మాయిల మీదకు విసిరి వికృతంగా ప్రవర్తించారు. అనంతరం కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినులు రెచ్చగొట్టారనే అరోపణలతో కేసులు పెట్టారు. ఖాకీ క్రౌర్యంపై మీడియా ముందు విద్యార్థినులు బావురుమన్నారు. తమను ఘోరంగా అవమానించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బూటు కాళ్లతో తొక్కడం మూలంగా ఇప్పటికీ నడవలేకపోతున్నానని మరో విద్యార్థిని వాపోయింది. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తమకు టీచర్లు కావాలని అడిగామన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే పదవతరగతి పరీక్షలు ఎలా రాయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు స్పందించాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘ నేత కవిత శ్రీవాస్తవ సంబంధిత పోలీస్ ఆఫీసర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థినిలపై లాఠీచార్జి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని జిల్లా కలెక్టర్ రేఖా గుప్త ప్రకటించారు.