ఇటీవల "వేగన్" అంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం అవుతోంది. శాఖాహారమే తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలు వెల్లువెత్తున్నాయి కూడా. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. గానీ ఏదైనా మనం మోతాదుకు మించి ఉపయోగించటమే సముచితం. ఎందుకంటే శాకాహారి అయినా, మాంసహారి అయిన దేన్నైనా లిమిట్‌గా తీసకుంటూ శరీర తత్వాన్న బట్టి వారికి అనువైన రీతిలో డైట్ ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఈ రష్యన్ మహిళే ఉదహారణ. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది అంటే..
అసలేం జరిగిందంటే..39 ఏళ్ల శానా శామ్సోనోవా అనే రష్యన్ మహిళ గత కొన్నేళ్లు వేగన్ రాఫుడ్ కోసం ప్రచారం చేస్తోంది. ఎప్పటి కప్పుడూ తాను ఏవిధంగా పూర్తి స్థాయిలో రా శాకాహారం తింటుందో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. ఒక దశాబ్దంపాటు ఆ డైటే ఫాలో అయ్యింది. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి వేగన్‌గా మారడం అంటే వాళ్లు కనీసం ఆవు లేదా గెదే పాలు తాగారు, సోయాబీన్స్ వంటి వాటికి సంబంధించిన పాలే తాగుతారు. ఐతే శానా శామ్సోనోవా శాకాహారం అంటే మరీ ఘోరంగా ఆయిల్ లేనివి, కేవలం పచ్చి కూరగాయాలు, వాటితో చేసిన వంటకాలు అంతే తీసుకునేది.
అది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతలా అంటే అస్థిపంజరం మాదిరిగా అయ్యేంత దారుణ స్థితికి తీసుకొచ్చింది. పోనీ అప్పుడైన కాస్త డైట్ మార్చి కొవ్వులతో కూడిన ఫుడ్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఆరోగ్యం కుదుటపడేంత వరకు ప్రోటీన్లతో కూడిన అన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా బావుండేది. అలా చేయకపోవడంతో కాళ్లు వాపుకి గురై లేచి నడవలేనంత స్థితికి వెళ్లిపోయింది. చివరికి ఆస్పత్రి పాలై ప్రాణాల కోసం పోరాడుతూ చనిపోయింది. పాపం ఆమె తల్లి కూడా తన కూతురు పూర్తి స్థాయిలో శాకాహారం తీసుకుని చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. చివరి స్టేజ్‌లో ఆకలివేసినా.. తినలేని దయనీయ స్థితికి చేరుకుని చనిపోయినట్లు వెల్లడించింది.
ఏ డైట్ అయినా ఆరోగ్యకరమైన రీతిలో మన శరీరీం యాక్స్‌ప్ట్ చేసేంత మోతాదులో తీసుకోవాలి. తీసుకుంటుంది శాఖాహార అయినప్పుడూ కొవ్వులు లభించే నట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే కాస్త శరీరానికి బలం చేకూర్చేలా కూరల్లో ఆయిల్ చేర్చాలి. అంతేగాని 'వేగన్' పేరుతో ఇలా పూర్తిగా కూరగాయాలు అంటూ పిచ్చిపిచ్చిగా ఫాలో అయితే ఇలానే చెయిచేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవుతారు. దయచేసి శాకాహారం లేదా మాంసహారి అయినా సరైన రీతిలో డైట్ ఫాలో అవ్వండి లావు అవుతామనో లేదా ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం అనో మరింతగా నోరు కట్టేసుకునేలా డైట్‌లు చేసి ప్రాణాలను కోల్పోవద్దు.
(చదవండి: పీచే కదా అని తీసిపడేయకండి!)
Comments
Please login to add a commentAdd a comment