
మాస్కో : మానవత్వం కనుమరుగై స్నేహితుని గొంతు కోసి చంపడమే కాకుండా అతని రక్తం తాగిన ఓ రాక్షసుడు డాక్టర్ అవతారం ఎత్తాడు. హోమిసైడల్ స్క్రీజోఫీనియా అనే మానసిక వ్యాధితో.. ఉన్మాదిగా మారిన ఆ వ్యక్తి ఏకంగా సైకియాట్రిక్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వివరాలు.. ఉరల్స్ పట్టణంలోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో బోరిస్ కొంద్రషీన్ (36) డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్టు గత నవంబర్‌లో గుర్తించారు.
రాక్షసుడిగా అవతారం
1998లో కొంద్రషీన్ 16 ఏళ్ల తన హైస్కూల్ స్నేహితున్ని మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను రాక్షసుడిగా ఊహించుకుని అతని రక్తం తాగాడు. కొంద్రషీన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందున కోర్టు అతనికి సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ ఇప్పించాలని అతని కుటుంబాన్ని 2000 సంవత్సరంలో ఆదేశించింది. పదేళ్లపాటు ట్రీట్‌మెంట్ పొందిన కొంద్రషీన్ ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి నగరంలోని‘ సిటీ హాస్పిటల్’లోఉద్యోగంలో చేరాడు. మద్యం సేవించడం.. పొగ త్రాగడం వల్ల వచ్చే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడమే అక్కడ కొంద్రషీన్ పని. ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్‌గా నటిస్తూ అందర్నీ నమ్మించాడు. అయితే ఇంటర్‌ఫ్యాక్స్ అధికారులు సదరు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఈ నరహంతక ‘సైకియాట్రిక్’బండారం బయటపడింది. ఇంద్రషీన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
‘నాకు గానీ, మా అమ్మకు గానీ కొంద్రషీన్ జాబ్ చేస్తున్నాడని తెలియదు. అతను హైస్కూల్ వరకే చదువుకున్నాడు’ అని కొంద్రషీన్ సోదరి చెప్పారు. అయితే, ట్రీట్‌మెంట్ అనతరం తన సోదరుడు పూర్తిగా మారిపోయాడని, ఎవరికీ హాని తలపెట్టడం లేదని తెలిపారు. అతను ఇంకొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment