చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.
గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)
Comments
Please login to add a commentAdd a comment