సాక్షి, న్యూఢిల్లీ: ఊహించని పనులు చేసే వ్యక్తులను అరుదైన వారిగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ట్యాటూల కోసం ఓ రష్యన్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయం.. నేటి ఆధునిక కాలంలో ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్ అయింది. కానీ, వాటితోనే ఒళ్లంతా నింపేసుకునే ఘటనలు చాలా అరుదు. కానీ, ట్యాటూల కోసం తన సున్నిత అవయవాలు సైతం పణంగా పెట్టడం మాత్రం అరుదైన వాటిలో అరుదు. రష్యాకు చెందిన 32 ఏళ్ల ఆడం కర్లీకేల్ ట్యాటూల కోసం ఏకంగా తన గుప్త భాగాలనే తీసేయించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలతో నింపేసుకుని సరికొత్త వర్ణంలోకి మారిపోయాడు.
ఎందుకంటే తనకి చర్మ క్యాన్సర్. ఎంతకాలం జీవిస్తాడో తెలియని తనకి క్యాన్సర్‌తో పాటు ఆల్బునిజం (శరీరం రంగు మారే వ్యాధి) సోకడంతో ఒళ్లంతా అందవిహీనంగా మారిపోయిందట. అందుకే బతికే కొన్నాళ్లయినా తన జబ్బు ప్రతిక్షణం గుర్తుకు రావొద్దని శరీరం మొత్తం ట్యాటూలకు అప్పగించేశాడు. 100 శాతం ట్యాటూలతో రికార్డు సృష్టించాడు. తనకు బూడిద రంగు అంటే ఇష్టమనీ, అందుకే జబ్బు పడినప్పుడు ఒళ్లంతా ఇలా నింపేశానని ఆడం చెప్పుకొచ్చాడు. కొసమెరుపు.. దేవుడి దయ వల్ల ఆడం క్యాన్సర్‌ను జయించి ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment