tatoos
-
ఒంటిపై ఉన్న టాటూ కనిపించేలా ఫోటో షూట్.. శృతిహాసన్ పోస్ట్ అర్థమేంటి?
నటి శృతిహాసన్ ఎప్పుడూ సంచలనమే. లోక నాయకుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. హిందీ చిత్రం లక్ ద్వారా కథానాయికగా పరిచయమైనా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలకే పరిమితమయ్యారు. అలా ధనుష్ కు సరసన 3, సూర్య జంటగా 7ఆమ్ అరువు వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా విజయాలను అందుకున్నది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమంలోనే. తాజాగా ప్రభాస్‌కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. కాగా ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ నెటిజన్లను ఖుషి చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పేరుతో కూడిన టాటూను ఒంటిపై కనిపించేలా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో తాను అన్నింటిని మరచి బయటకు రావాలని కోరుకుంటున్నానని, ఇకపై తాను లేచి నిలబడడం నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. తన విషయాలను తన స్టైల్లో చేస్తానని ఇది తన రహదారి లేదా బైపాస్ అని శృతిహాసన్ పేర్కొన్నారు. దీంతో శృతిహాసన్ మాటల్లో అర్థం ఏమిటి రామా అంటూ ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
బాయ్‌ఫ్రెండ్ పేరుతో నుదుటిపై పచ్చబొట్టు.. వీడియో వైరల్
ప్రేమను అనేక రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రేమను తెలియజేస్తుంటారు. ఇంకొందరు మాత్రం జీవితాంతం గుర్తుండేలా, తమకు నచ్చిన వార్ల పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. తాజాగా ఓ యువతి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ పేరును ఏకంగా నుదుటిపై టాటూ వేయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్ నడుస్తోంది. యూత్‌కి టాటూలపై వీపరీతమైన క్రేజ్.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్ వేయించుకుంటున్నారు. కొందరు జీవితకాలం జ్ఞాపకంలా ఉండాలని తమ ప్రియమైన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫోటోలను కూడా టాటూలుగా వేయించుకోవడం ఇప్పటి వరకు చాలా చూశాం. View this post on Instagram A post shared by Ana Stanskovsky-Content creator (@ana_stanskovsky) కానీ యూకేకు చెందిన ఓ యువతి తన ప్రియుడిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నంగా ఆలోచించి ఏకంగా నుదుటిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'పిచ్చి పది రకాలు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది, అయినా ఒకవేళ నీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్ప్ అయిపోతే ఏం చేస్తావ్' అంటూ వ్యంగంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. నిజాయితీ ఉన్న ప్రేమకు ఇలాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం ఏముంది? అయినా టాటూ ఫిల్లింగ్ చూస్తుంటే ఇది ఫేక్ వీడియోలా ఉంది. పబ్లిసిటీ కోసం ఇలా చేసిందేమో అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆమె స్వయంగా స్పందిస్తూ.. ''ఇది నిజంగా పచ్చబొట్టు. నా బాయ్‌ఫ్రెండ్‌పై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇలా టాటూ వేయించుకున్నా. అయినా మీరు అనుకున్నట్లు మాకు బ్రేకప్ జరగదు. ఎందుకంటే కెవిన్(బాయ్‌ఫ్రెండ్ పేరు)తో నేను చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాను. అద్దంలో నా ముఖం చూసుకున్న ప్రతీసారి కెవిన్ నాతోనే ఉన్నట్లు చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు లేని ఇబ్బంది మీ అందరికి ఏంటో'' అంటూ ట్రోలర్స్‌కి గట్టిగానే బదులిచ్చింది. View this post on Instagram A post shared by Ana Stanskovsky-Content creator (@ana_stanskovsky) -
సమంత శరీరంపై ఆ టాటూ మిస్సింగ్.. ‘చై’ని చెరిపేసిందా?
సమంత- నాగ చైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉండేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. విడాకులు తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. అయినా కూడా వీరిద్దరి పర్సనల్ లైఫ్‌కు సంబధించి ఇప్పటికీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. వీటిని అటు నాగచైతన్య కానీ ఇటు సమంత పెద్దగా పట్టించుకోకుండా తమ తమ పనుల్లో బీజీ అవుతున్నారు. ప్రస్తుతం సామ్ దుబాయ్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత.. కొన్నాళ్ల పాటు విహారయాత్రల చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే మొన్నటి వరకు అమెరికా పర్యటనకు వెళ్లి..ఇప్పుడు దుబాయ్ అందాలను వీక్షించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన మాజీ భర్త నాగ చైతన్య కోసం వేయించుకున్న పచ్చబొట్టును సామ్ తొలగించుకున్నారనేది ఆ వార్త సారంశం. ప్రేమకు గుర్తుగా టాటూ సమంత-నాగ చైతన్యలది ప్రేమ వివాహం అని అందరికి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చై ప్రేమకు గుర్తుగా సమంత తన శరీరంపై మూడు టాటూలను వేయించుకుంది. అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడో టాటూ నడుముపై వేయించుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఈ టాటూల విషయం చర్చనీయాంశంగా మారింది. సామ్ టాటూలు తొలగిస్తుందా లేదా? అనే చర్చ నెట్టింట జోరుగా జరిగింది. ‘చై’టాటూ తొలగించిందా? నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన శరీరంపై టాటూలను అలానే ఉంచుకుంది. అప్పట్లో సామ్ చేసిన ఫోటో షూట్స్‌లో నడుము ఉన్న టాటూ చర్చనీయాంశంగా మారింది. భర్తకు దూరమైనా.. అతని ముద్దు పేరు మాత్రం వదిలించుకోవడం లేదనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సామ్ పింక్ సారీలో ఫోటోషూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలను పరీశీలిస్తే..నడుముపై ‘చై’టాటూ మిస్ అయింది. దీంతో సామ్ ఆ టాటూని తొలగింకున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. టాటుని తొలగించుకోవడం కష్టమని, మేకప్ వేసి కవర్ చేశారని మరికొందరు అంటున్నారు. చై-సామ్ మళ్లీ కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘చై’ టాటూ కనిపించకపోవడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
టాటులతో వరల్డ్ రికార్డు..అది కూడా 667..
వరల్డ్ రికార్డ్ క్రేజ్ ఉన్న వాళ్లు దాన్ని సాధించేందుకు అంతే క్రేజీగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్రేజీ లిస్ట్‌లోకి యూకేకు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్నూ చేర్చొచ్చు. శరీరంపై తన కూతురు పేరుతో 667 టాటూలు వేయించుకున్నాడు. ఆల్రెడీ వీపు వెనుక భాగంపై ‘లూసీ’ పేరుతో 267 టాటూలు వేయించుకుని 2017లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. అయితే 2020లో డ్రా విజిల్ అనే 27 ఏళ్ల మహిళ తన శరీరం మీద తన పేరుతో 300 టాటూలు వేయించుకుని మార్క్ ఓవెన్ ఎవాన్స్ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. ఆ మహిళను అధిగమించి, ఎలాగైనా తిరిగి గిన్నిస్ రికార్డును పొందాలని మార్క్ నిశ్చయించుకున్నాడు. అందుకోసం అతను తన కూతురు బర్త్ డే సందర్భంగా తన రెండు కాళ్లపై మరో నాలుగు వందసార్లు ఆమె పేరును టాటూలు వేయించుకున్నాడు. అలా మొత్తం 667 టాటూస్‌తో మార్క్ ఓవెన్ మరోసారి వరల్డ్ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. (చదవండి: జపాన్‌లో శరత్కాల వేడుకలు!) -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
టాటూ ట్రెండింగ్.. క్యూ కడుతున్న యువత !
సాక్షి,నిర్మల్‌చైన్‌గేట్: ప్రస్తుత కాలంలో టాటూ.. ట్రెండ్ గా మారింది. నాటి పచ్చబొట్టే.. నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు వ్యక్తుల ఫొటోలను టాటూగా వేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం.. మరికొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్, డిఫరెంట్ వెరైటీస్‌తో లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకొని మురిసిపోతున్నారు యువత. యూత్ ఫ్యాషన్‌గా.. టాటూ ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, దేవతల ఫొటోలను టాటూగా వేసుకోవడం ట్రెండ్‌గా మారింది. మనసుకు నచ్చినట్టుగా.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్‌తో వేస్తున్నారు. వివిధ రకాలతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. మల్టీకలర్స్‌తో లైఫ్ లాంగ్ గుర్తుండేలా వేసుకోవడం ప్రస్తుత రోజుల్లో క్రేజ్‌గా మారింది. వెలిసిన సెంటర్లు.. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్ ప్రస్తుతం చిన్నపట్టణాలను సైతం విస్తరించింది. గతంలో జాతర్లలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలిశాయి. క్రేజ్ పెరిగింది.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం యువతకు టాటులపై క్రేజ్ పెరిగింది. – సంతోష్ వర్మ, టాటూ కళాకారుడు ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం. అందుకు తగ్గట్టుగానే నేను టాటూ వేయించుకున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే టాటూ సెంటర్ అందుబాటులో ఉండడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. – దరందాస్ సాయి, నిర్మల్ -
ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్ విమన్ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్ఇన్లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్‌ప్లేస్‌లో కల్చర్ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్ క్యాపిటల్ పార్టనర్ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్ రూమ్‌లోకి అడుగు పెట్టింది. టాటాల చుట్టే విమర్శలు జెస్సికా హాంజీ లియోనార్డ్‌కి పచ్చబొట్లు (టాటూస్) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్‌స్టైల్‌ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. ఇంకా దాచలేను టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్ క్యాపిటల్‌లో చేరింది. దీంతో వెబ్సైట్లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే బాస్ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్ వెబ్సైట్లో జాకెట్(కోట్)తో కూడిన ఫోటోను అప్లోడ్ చేస్తానని, తన పర్సనల్ లింక్డ్ఇన్లో స్లీవ్‌లెస్ డ్రెస్‌తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే టెన్షన్‌తో ఆమెలో పెరిగిపోతోంది. లౌడ్ అండ్ ప్రౌడ్ జెస్సికా రిక్వెస్ట్‌ని విన్న వాళ్ల బాస్ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్ఇన్లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్ వెబ్సైట్లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్లోడ్ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్‌లెస్‌తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్లోడ్ చేయ్ విత్ లౌడ్ అండ్ ప్రౌడ్ అంటూ పర్మిషన్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ ముఖ్యం నేను కోటు ధరించానా ? స్లీవ్‌లెస్‌లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ జెస్సికా లింక్డ్ఇన్లో రాసుకొచ్చింది. చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే -
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నేరస్తుడు
మిస్సోరి: మిస్సోరీకి చెందిన 46 ఏళ్ల మైఖేల్ కాంప్‌బెల్ తన ముఖమంతా పూర్తిగా టాటూలు వేయించుకున్నందుకు గానూ 'ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమినల్' గా పిలుస్తున్నారు. అంతే కాదు యురోపియన్ సంతతికి చెందిన మైఖేల్ ముక్కు, పెదవులు, మెడ కింద మాత్రమే చర్మం కనిపిస్తుంది తప్ప ముఖం అంతా టాటులతో నిండి ఉంటుంది. పైగా నదుదిటిపై పెంటాగ్రామ్, అతని మెడపై విల్లులాంటి టై, కుక్క అతని గుండు పైన 88 సంఖ్య ఉన్నాయి. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) అయితే ఇటీవలే అత్యాచారయత్నం కేసులో అరెస్టు అయిన నేరస్తుడు. ఈ మేరకు మైఖేల్ గతేడాది ఆస్తి నష్టం, దాడి వంటి ఆరోపణలతో ఆరు నెలలు జైలు శిక్షను కూడా అనుభవించాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయితే మరోసారి జీవితాంతం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు మైఖేల్ కేవలం 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని మొదటి నేరారోపణ జరిగినట్లు వివరించారు. కానీ ఆ సమయంలో మైఖేల్ ముఖం పై కేవలం ఒక పచ్చబొట్టు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇటీవలే అతని తండ్రి కోవిడ్‌తో చనిపోవడంతో అతని జ్ఞాపకార్థం మైఖేల్ ఇద్దరూ సోదరీమణులు కూడా టాటులు వేయించుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు టాటుల కుటుంబం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మా స్కూల్ సమీపంలో మద్యం షాపును తీసేయండి!) -
"కదిలే టాటుల అద్భుతమైన వీడియో
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువతకు టాటులంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిపైన ఎక్కడొ ఒక చోట టాటు లేకుండా మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ మంచి టాటు వేయించుకోవాలనే అనుకుంటారు. అదేవిధంగా ఆర్టిస్టు కూడా తన కస్టమర్‌కి మంచి టాటును ఇచ్చి తన నైపుణ్యన్ని ప్రదర్శించడం కోసం ఆరాటపడటం సహజం. కానీ ఇక్కడ ఒక టాటో ఆర్టిస్ట్ తన సృజనాత్మకతను మరోస్థాయికి తీసుకువెళ్లాడు. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) అతను చిత్రించిన 76 టాటులతో కదిలే టాటులకు సంబంధించిన అద్భుతమైన వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ ఫిల్ బెర్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 76 టాటూల గురించి వివరిస్తూ..ఒక క్యాప్షన్‌ని జోడించి పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను అందుకోలేం, అమేజింగ్ వీడియో అంటూ రకరకాలుగా టాటు ఆర్టిస్ట్‌ని ప్రశంసిస్తూ ట్విట్ చేస్తున్నారు. (చదవండి: షారుక్ ప్రకటనలు నిలిపేసిన ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్) -
విరాట్ కోహ్లికి ప్రేమతో..
-
విరాట్ కోహ్లికి ప్రేమతో..
2016లో డిసైడ్ అయ్యాడు. విరాట్ కోహ్లిపై తనకున్న ప్రేమాభిమానాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. కానీ ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ట్యాటూలకు కావాల్సిన డబ్బులు లేవు. దీంతో పైసా పైసా పోగుచేసి తాను అనుకున్నది సాధించాడు. విరాట్ కోహ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు అతడి జెర్సీ నంబర్ 18తో సహా శరీరంపై 16 చోట్ల పచ్చబోట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు పింటు బెహరా అనే ఓ అభిమాని. కటక్: వెస్టిండీస్‌తో నిర్ణయాత్మకమైన చివరి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లిని పింటు బెహరా అనే ఓ అభిమాని కలిశాడు. అయితే రెగ్యులర్ ఫ్యాన్‌గానే ట్రీట్ చేస్తున్న సమయంలో చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లికి చూపించాడు. దీంతో కోహ్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఒంటి నిండా కోహ్లికి సంబంధించిన మొత్తం 16 ట్యాటూలు ఉన్నాయి. ఇందులో కోహ్లి జెర్సీ నంబర్ 18 కూడా ఉండటం విశేషం. ఇక ఈ ట్యాటూలపై పింటు బెహరా స్పందించాడు. ‘నేను క్రికెట్ ప్రేమికుడిని. విరాట్ కోహ్లి అంటే పిచ్చి అభిమానం. ఆటపై అతడికున్న డెడికేషన్‌కు, బ్యాటింగ్ స్టైల్‌తో నా మనసు గెలుచుకున్నాడు. అయితే అతడిపై నాకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని 2016లో భావించాను. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఒంటినిండా ట్యూటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందని తెలిసి నిరుత్సాహపడ్డాను. అయితే పైసా పైసా పోగుచేసి రూ.లక్ష జమచేసి ఈ ట్యాటూలు వేయించుకున్నాను. స్వదేశంలో కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను తప్పకుండా వెళతాను. ఆర్థిక పరిస్థితి కారణంగా విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లలేకపోతున్నాను. అవకాశం వస్తే కోహ్లికి మద్దతుగా విదేశాలకు కూడా వెళ్లడానికి సిద్దం’అంటూ బెహరా పేర్కొన్నాడు. ప్రస్తుతం పింటు బెహరాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవతున్నాయి. -
కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ : రాక్‌స్టార్స్‌ను తలిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటిపై ఎన్ని టాటూలు ఉన్నాయ్? అవి ఏంటో తెలుసా..? తెలియాలంటే మాత్రం ఈ వార్త చదవాల్సిందే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ప్రసారమైన మెగా ఐకాన్స్ ఎపిసోడ్లో కోహ్లే ఈ పచ్చబొట్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘చిన్నతనం నుంచే పచ్చబొట్లు వేసుకునే అలవాటు ఉంది. తరువాత ఈ టాటులు మనకు ఎదో సొంత గుర్తింపునిస్తాయని అర్థమైంది. నా మోచితిపై ఉన్న లార్డ్ శివ టాటూ నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో ప్రతిబింబిస్తోంది.’ అని తెలిపారు. ఇలా తన ప్రయాణంలోని విజయాలకు చిహ్నంగా కోహ్లి మొత్తం 9 పచ్చబొట్లు పొడిపిచ్చుకున్నాడు. మూడేళ్లప్పుడే క్రికెట్‌కు పరిచయం చేసిన తన తల్లిదండ్రులపై తనకున్న ప్రేమకు చిహ్నంగా ప్రేమ్, సరోజ్ పేర్లను టాటులుగా మజిల్స్‌పై వేసుకున్నాడు. తన ఆరాధ్యదైవమైన లార్డ్ శివ పచ్చబొట్టును మోచేతిపై, దీని పక్కనే 22 అడుగుల పిచ్‌కు చిహ్నంగా ఓ మఠం గుర్తును పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు. వన్డే, టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లో అందుకున్న క్యాప్ నెంబర్స్ 175, 269 నెంబర్లను, తన దూకుడుకు చిహ్నంగా ట్రైబల్ టాటూను వేసుకున్నాడు. తన జన్మ రాశి అయిన వృశ్చిక రాశిని తెలియజేసేలా జోడియాక్ స్టైల్లో కుడి మజిల్పై స్కార్పియో అని రాయించుకున్నాడు. ఎడమ చేతిపై జపనీస్ సమురై అనే పెద్ద టాటూను న్యాయం, ధైర్యం, దయాగుణం, సభ్యత, గౌరవం, భక్తి, నిజాయితీలకు చిహ్నంగా, కుడి భుజంపై దేవుడి కన్నును టాటుగా వేయించుకున్నాడు. దేవుడి కన్ను టాటూ తనకు ప్రత్యేకమని తెలిపాడు. దీనిపైన ఓం గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. ఈ పదాన్ని ప్రపంచంలోనే అందరూ ఒకేలా పలుకుతారని చెప్పుకొచ్చాడు. కోహ్లి టాటూ చిత్రాలు కోసం కింది స్లైడ్ షోను క్లిక్ చేయండి -
ట్యాటూల కోసం ఏం చేశాడో తెలుసా..!
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించని పనులు చేసే వ్యక్తులను అరుదైన వారిగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ట్యాటూల కోసం ఓ రష్యన్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయం.. నేటి ఆధునిక కాలంలో ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్ అయింది. కానీ, వాటితోనే ఒళ్లంతా నింపేసుకునే ఘటనలు చాలా అరుదు. కానీ, ట్యాటూల కోసం తన సున్నిత అవయవాలు సైతం పణంగా పెట్టడం మాత్రం అరుదైన వాటిలో అరుదు. రష్యాకు చెందిన 32 ఏళ్ల ఆడం కర్లీకేల్ ట్యాటూల కోసం ఏకంగా తన గుప్త భాగాలనే తీసేయించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలతో నింపేసుకుని సరికొత్త వర్ణంలోకి మారిపోయాడు. ఎందుకంటే తనకి చర్మ క్యాన్సర్. ఎంతకాలం జీవిస్తాడో తెలియని తనకి క్యాన్సర్‌తో పాటు ఆల్బునిజం (శరీరం రంగు మారే వ్యాధి) సోకడంతో ఒళ్లంతా అందవిహీనంగా మారిపోయిందట. అందుకే బతికే కొన్నాళ్లయినా తన జబ్బు ప్రతిక్షణం గుర్తుకు రావొద్దని శరీరం మొత్తం ట్యాటూలకు అప్పగించేశాడు. 100 శాతం ట్యాటూలతో రికార్డు సృష్టించాడు. తనకు బూడిద రంగు అంటే ఇష్టమనీ, అందుకే జబ్బు పడినప్పుడు ఒళ్లంతా ఇలా నింపేశానని ఆడం చెప్పుకొచ్చాడు. కొసమెరుపు.. దేవుడి దయ వల్ల ఆడం క్యాన్సర్‌ను జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. My new JEEP. 🛴 #nullo #nullyfication #new #car #adamcurlykale A post shared by Adam (Oreo) Curlykale (@adam.curlykale) on Jul 17, 2018 at 5:36am PDT -
టాటూ ఉంటే ఉద్యోగం పోయినట్టే
న్యూఢిల్లీ: శరీరంపై శాశ్వతంగా ఉండే టాటూ వేయించుకున్న వారు తమ విభాగంలో ఉద్యోగాలకు అనర్హులంటూ ఎయిర్‌ఫోర్స్ విధించిన నిబంధనను న్యాయస్థానం సమర్థించింది. టాటూ ఉందన్న కారణంతో తనను అనర్హుడిగా ప్రకటించారంటూ ఓ యువకుడు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. సదరు అభ్యర్థి ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న మేరకు తన శరీరంపై ఉన్న టాటూ ఫొటోను జత చేయలేదని ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆచారాలు, సంప్రదాయాల మేరకు టాటూలు వేయించుకునే గిరిజన అభ్యర్థులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న నిబంధనలకు లోబడే ఎయిర్‌ఫోర్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. -
బ్రాండ్ బొట్లు
అరగుండు నుంచి కనుగుడ్డు వరకూ.. శరీరం మీద టాటూలు వేయించుకుని వాణిజ్య సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించడం... పాశ్చాత్య దేశాల్లోని చాలామందికి ఒక ఉపాధి మార్గం. తమ సంస్థలకు ప్రచారాన్ని కల్పించుకోవడానికి టాటూ వేయించడం ఒక చక్కటి మార్గమని చాలా ‘బ్రాండ్లు’ నమ్ముతున్నాయి. ఇదే సమయంలో ఉత్సాహవంతులు శరీరంపై టాటూలు పొడిపించుకుని దీన్నొక సంపాదన మార్గంగా మార్చుకుంటున్నారు. దీన్నొక పార్ట్‌టైమ్ జాబ్‌గా మొదలుపెట్టి దీన్నే ఫుల్‌టైమ్ బిజినెస్‌గా మార్చుకున్న వ్యక్తి మేథ్యూవాలెన్. ఇతడి శరీరం 80 శాతం టాటూలతోనే నిండిపోయింది. అనేక బ్రాండ్ల వాళ్లు వాలెన్ కాలిబొటనవేలు నుంచి తలలోని సుడి వరకూ అణువణువునూ టాటూలతో నింపేశారు. ఇతడి వెంట్రుకలు కూడా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. అరగుండు లో కూడా ఐదారు బ్రాండ్ల టాటూలున్నాయి. ఆఖరికి వాలెన్ కనుగుడ్డులో కూడా టాటూ ఉంది! అంటే ఇతడి ‘బ్రాండ్’ బాజా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!